World Cup 2023: హైదరాబాద్ అడ్డాలో అడుగుపెట్టిన పాకిస్తాన్.. 7 ఏళ్ల తర్వాత తొలిసారి..
Pakistan vs New Zealand: పాకిస్థాన్ జట్టు బుధవారం హైదరాబాద్ చేరుకుంది. అయితే, సెప్టెంబర్ 29న తన మొదటి వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. వీసాకు సంబంధించి ఇంతకుముందు అనేక వివాదాలు వచ్చాయి. కానీ, ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి బాబర్ ఆజం తన బృందంతో ఇక్కడకు చేరుకున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌కి భారతదేశం స్టైల్‌లో స్వాగతం పలికారు. ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్ జట్టు క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు భారత్‌కు వచ్చింది. దీనికి ముందు టీమ్ 2016 టీ-20 ప్రపంచ కప్ కోసం భారతదేశానికి వచ్చింది.

Pakistan vs New Zealand: అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) కి మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ మైదానంలో టోర్నీ ప్రారంభ మ్యాచ్ జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లండ్, చివరి రన్నరప్ జట్టు న్యూజిలాండ్ (England vs New Zealand) జట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్నాయి. అయితే అంతకు ముందు సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం, పాకిస్తాన్ జట్టు సెప్టెంబర్ 29న న్యూజిలాండ్ (Pakistan vs New Zealand)తో తన వార్మప్ మ్యాచ్ కూడా ఆడనుంది.
ఈమేరకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రపంచకప్ కోసం హైదరాబాద్ చేరుకుంది. బుధవారం సాయంత్రం, కెప్టెన్ బాబర్ అజామ్ నేతృత్వంలోని పాక్ జట్టు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగింది. అక్కడ వారికి సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.




ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్ జట్టు క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు భారత్‌కు వచ్చింది. దీనికి ముందు టీమ్ 2016 టీ-20 ప్రపంచ కప్ కోసం భారతదేశానికి వచ్చింది. పాకిస్థాన్ జట్టు విమానాశ్రయానికి చేరుకోగానే పలువురు క్రికెటర్లతో సెల్ఫీలు దిగారు. ఇది కాకుండా జట్టు హోటల్‌లో ఆటగాళ్లందరికీ భారతీయ శైలిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అందరికి కాషాయ రంగు శాలువాలు ధరించి స్వాగతం పలికారు.
వీసా విషయంలో గొడవలపై క్లారిటీ..
Pakistan players arrive in India for #CWC23 ✈💪 pic.twitter.com/6GKhhNBF4O
— ICC (@ICC) September 27, 2023
పాకిస్తాన్ క్రికెట్ జట్టు (పీసీబీ) సెప్టెంబర్ 25 న మాత్రమే వీసా పొందింది. వీసా పొందడంలో జాప్యంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసిందనే వార్తలు వినిపించాయి. అయితే పీసీబీ స్వయంగా దానిని తిరస్కరిస్తూ ప్రకటన విడుదల చేసింది. పీసీబీ ప్రకారం సెప్టెంబర్ 19 న వీసా కోసం దరఖాస్తు చేశామని, BCCI సెప్టెంబర్ 25న వీసాలు మంజూరు చేసిందని, ఆలస్యం కాలేదంటూ చెప్పుకొచ్చింది.
2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ షెడ్యూల్:
29 సెప్టెంబర్ vs న్యూజిలాండ్ (వార్మ్ అప్ మ్యాచ్)
3 అక్టోబర్ vs ఆస్ట్రేలియా (వార్మ్ అప్ మ్యాచ్)
6 అక్టోబర్ vs నెదర్లాండ్స్
10 అక్టోబర్ vs శ్రీలంక
14 అక్టోబర్ vs భారతదేశం
20 అక్టోబర్ vs ఆస్ట్రేలియా
23 అక్టోబర్ vs ఆఫ్ఘనిస్తాన్
27 అక్టోబర్ vs సౌత్ ఆఫ్రికా
31 అక్టోబర్ vs బంగ్లాదేశ్
ప్రపంచకప్‌కు పాక్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అగా, మహ్మద్ నవాజ్, ఒసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
