MS Dhoni: ధోని రిటైర్మెంట్ ప్లాన్ చేశాడా.. చెపాక్‌లో కనిపించిన అరుదైన సీన్.. విషాదంలో ఫ్యాన్స్?
MS Dhoni May Retire From IPL: ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2025లో సందడి చేస్తున్నాడు. ఇదే ధోని చివరి సిరీస్ అంటూ వార్తలు వినిస్తున్నాయి. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ వార్తలకు బలం చేకూర్చే ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.

MS Dhoni May Retire From IPL: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏం బాగోలేదు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడని చెన్నై టీం కేవలం ఓకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. నేడు చెన్నై తన నాలుగో మ్యాచ్‌ని సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీంతో తలపడుతోంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా ధోని గురించి సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
‘తలా’గా పేరుగాంచిన ధోని.. ఐదు ఐపీఎల్ టైటిళ్లతోపాటు లెక్కలేనన్ని చిరస్మరణీయ క్షణాలు అభిమానులకు అందించాడు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ గురించి రెండు, మూడేళ్లుగా ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. చిన్నస్వామి వేదికగా నేడు జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో మరోసారి ధోని రిటైర్మెంట్ గురించి వార్తలు ఊపందుకున్నాయి. అందుకు ఓ కారణం కూడా ఉంది. ఎంఎస్ ధోని తల్లిదండ్రులు ఎంఏ చిదంబరం స్టేడియంలో కనిపించడంతో.. ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తమ కొడుకును ఉత్సాహపరిచేందుకు, చివరిసారిగా ధోని ఆటను చూసేందుకు మైదానంలోకి వచ్చారని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఎంఎస్ ధోని ఐపీఎల్ కెరీర్..
Dhoni’s parents at Chepauk #WhistlePodu #IPL #CSK @MSDhoni pic.twitter.com/SV7ucNHn6V
— MSDian™ (@ItzThanesh) April 5, 2025
ఎంఎస్ ధోని IPLలో 267 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 267 మ్యాచ్‌లలో, అతను 232 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 39.18 సగటు, 137.70 స్ట్రైక్ రేట్‌తో 5,289 పరుగులు చేశాడు.
ఈ చెన్నై లెజెండ్ ఫ్రాంచైజీకి 237 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లలో, అతను 40.30 సగటు, 139.46 స్ట్రైక్ రేట్‌తో 4,715 పరుగులు చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




