Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs NZ: సరిగ్గా బాల్‌ వేసే టైమ్‌కి.. గ్రౌండ్‌ అంతా చిమ్మచీకటి..! పాపం బ్యాటర్..!

న్యూజిలాండ్ - పాకిస్తాన్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. బౌలర్ బంతిని విసిరే సమయంలో బే ఓవల్‌లో అకస్మాత్తుగా పవర్ కట్ సంభవించింది. చిమ్మచీకటిలో బ్యాటర్ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. చివరికి కివీస్ 3-0 తేడాతో సిరీస్ గెలిచింది. వర్షం కారణంగా మ్యాచ్ 42 ఓవర్లకు తగ్గించబడింది.

PAK vs NZ: సరిగ్గా బాల్‌ వేసే టైమ్‌కి.. గ్రౌండ్‌ అంతా చిమ్మచీకటి..! పాపం బ్యాటర్..!
Pak Vs Nz Power Cut
Follow us
SN Pasha

|

Updated on: Apr 05, 2025 | 6:57 PM

బాల్‌ ఆడేందుకు బ్యాటర్‌ రెడీగా ఉన్నాడు.. అంత దూరం నుంచి బాల్‌తో బౌలర్‌ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.. ఫీల్డర్లంతా అలెర్ట్‌గా ఉన్నాడు. బౌలర్‌ సరిగ్గా బాల్‌ రిలీజ్‌ చేసే టైమ్‌కి గ్రౌండ్‌ అంతా చిమ్మచీకిటి కమ్మకుంది. ఏంటా అని చూస్తే.. గ్రౌండ్‌లో లైట్లు ఆఫ్‌ అయిపోయాయి. బాల్‌ రిలీజ్‌ చేసే టైమ్‌కి చీకటి కమ్ముకోవడంతో బ్యాటర్‌ పరిస్థితి ఏంటో అని అక్కడున్న వారు కంగారు పడ్డారు. ఈ సీన్‌ ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. న్యూజిలాండ్ వర్సెస్‌ పాకిస్తాన్ వన్డే సిరీస్‌లో భాగంగా శనివారం మూడో మ్యాచ్ సందర్భంగా ఈ వింత దృశ్యాలు చోటు చేసుకున్నాయి. బే ఓవల్‌లో అకస్మాత్తుగా పవర్ కట్ కారణంగా ఇది జరిగింది. కివీస్ పేసర్ జాకబ్ డఫీ 39వ ఓవర్‌లో ఐదో బంతిని వేయబోతుండగా గ్రౌండ్‌లోని లైట్లు ఆఫ్‌ అయిపోయాయి.

అయితే అప్పటికే డఫీ బాల్‌ రిలీజ్‌ చేసినప్పటికీ.. పాకిస్తాన్ బ్యాటర్ తయ్యబ్ తాహిర్ పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. అయితే, కొన్ని నిమిషాల తర్వాత లైట్లు తిరిగి వెలిగాయి. మైఖేల్ బ్రేస్‌వెల్ కెప్టెన్సీలోని కివీస్‌ ఈ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడో మ్యాచ్‌కు ముందు భారీ వర్షం కారణంగా, అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో కివీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి.. 8 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 40 ఓవర్లలో 221 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. బాబర్ అజామ్ 58 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 32 బంతుల్లో 37 పరుగులు చేసి పర్వాలేదనిపించినా.. పాక్‌ను గెలిపించలేకపోయారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్..
తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్..
వేసవిలో ఎండుద్రాక్షఎలా తినాలో తెలుసా.. లేదంటే ఆరోగ్యానికి హానికరం
వేసవిలో ఎండుద్రాక్షఎలా తినాలో తెలుసా.. లేదంటే ఆరోగ్యానికి హానికరం
ఇది గమనించారా.. SRH ఓటమికి కాటేరమ్మ కొడుకే కారణం?
ఇది గమనించారా.. SRH ఓటమికి కాటేరమ్మ కొడుకే కారణం?
బిగ్ షాక్.. TGPSC గ్రూప్ 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే..
బిగ్ షాక్.. TGPSC గ్రూప్ 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే..
పెండింగ్ పనులు పూర్తి అయ్యేందుకు ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి
పెండింగ్ పనులు పూర్తి అయ్యేందుకు ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి
JEE Main 2025 ఫలితాలపై వీడని ఉత్కంఠ.. ఫైనల్ కీ ఎందుకు తొలగించారో?
JEE Main 2025 ఫలితాలపై వీడని ఉత్కంఠ.. ఫైనల్ కీ ఎందుకు తొలగించారో?
కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పంజాబ్‌తో మ్యాచ్ రద్దయ్యేనా?
కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పంజాబ్‌తో మ్యాచ్ రద్దయ్యేనా?
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ
శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల ఎప్పుడంటే..
శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల ఎప్పుడంటే..
భోజనానికి పిలిచినా ఇలాంటి వారింటికి వెళ్ళవద్దన్న చాణక్య ఎందుకంటే
భోజనానికి పిలిచినా ఇలాంటి వారింటికి వెళ్ళవద్దన్న చాణక్య ఎందుకంటే