Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (December 29, 2025): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో తొందర పాటుతో వ్యవహరించవద్దు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి నుంచి సహాయం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో అధికారుల నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (డిసెంబర్ 29, 2025): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో తొందర పాటుతో వ్యవహరించవద్దు. వృషభ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగే అవకాశముంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితం సజావుగా సాగిపోతున్నా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. మధ్య మధ్య కొన్ని ప్రతికూలతలు తప్పకపోవచ్చు. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆదాయం వృద్ది చెందే అవకాశం ఉన్నప్పటికీ, ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో తొందర పాటుతో వ్యవహరించవద్దు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి నుంచి సహాయం లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి, కొందరు మిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయానికి లోటుండదు. ఆర్థికంగా అనుకూల పరిస్థితులుంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. పిల్లలు వృద్ధి లోకి వస్తారు. బంధువుల సహకారంతో పెళ్లి సంబంధం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అష్టమ రాహువు ప్రభావం కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఆలస్యంగా పూర్తవడం జరుగుతుంది. ఇంటా బయటా కొన్ని చిరాకులు ఉంటాయి. ఆదాయం కలిసి వస్తుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు ఉత్సాహంగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితంలోని వారికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. విదేశీయానానికి, విదేశాలలో స్థిరపడడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అనుకోకుండా మంచి ధన యోగం పడుతుంది. కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం లభి స్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. అనారోగ్య సమస్యలుండే అవకాశం ఉంది. గౌరవమర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొం టారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెంచడానికి అవకాశముంది. ఉద్యోగంలో అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయపడతారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. కుటుంబ సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఒకరిద్దరు బంధువులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆదాయం స్థిరంగా కొనసాగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. కొందరు చిన్న నాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశముంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయంగా ప్రాబల్యం పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లో స్థిర పడిన పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మిత్రుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులకు బాగా ఉపయోగ పడ తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు నిదానంగా కొనసాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. కొన్ని పనులు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ జీవితం పరవాలేదని పిస్తుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. ఆదాయం వృద్ధి చెందు తుంది. ఇష్టమైన మిత్రుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. సన్నిహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు అనుకోకుండా ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.