AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాటా ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం!

విశాఖపట్నం- దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా ఎర్నాకులం రైలులో మంటలు చెలరేగాయి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్ కు రైలు సమీపిస్తుండగా ఏసీ కోచ్ లో మంటలు అంటున్నాయి. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. మృతుడు విజయవాడకు చెందిన చంద్రశేఖర్ గా గుర్తించారు.

టాటా ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం!
Fire Accident In Ernakulam Express Train
Ravi Kiran
| Edited By: |

Updated on: Dec 29, 2025 | 6:41 AM

Share

ఎలమంచిలి, డిసెంబర్‌ 29: విశాఖపట్నం- దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ అగ్నిప్రమాదానికి గురైంది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగా ఆదివారం (డిసెంబర్ 28) అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రాత్రి 1.30గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రైలులోని ప్యాంట్రీ కారుకి పక్కపక్కనే ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన లోకో పైలట్లు ఎలమంచిలి సమీపంలోని రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపేశారు.

వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. దీంతో రైలులోని ప్రయాణికులు భయాందోళనలతో రైలు దిగి స్టేషన్‌లోకి పరుగులు పెట్టారు. అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే 2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్టేషన్‌ మొత్తం దట్టమైన పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాలు భీతావహకంగా కనిపించాయి. అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు.

అనకాపల్లికి నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చిన ఈ ట్రైన్‌.. అక్కడి నుంచి బయలుదేరి నర్సింగబల్లి మీదగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బీ1 ఏసీ బోగీ బ్రేక్‌లు పట్టేయడంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో బీ1 బోగీలో ఒకరు సజీవ దహనం అయ్యారు. మృతుడిని విశాఖకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70)గా గుర్తించారు. మిగతా ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రయాణికులు సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. దాదాపు రెండు 2 మంది ప్రయాణికుల ఆహాకారలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్లన్నీ రద్దు చేశారు. అర్ధరాత్రి 3.30 గంటల తర్వాత మరొక రైలులో ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

హోం మంత్రి అనిత స్పందన..

అనకాపల్లి జిల్లా ఎర్నాకుళo ఎక్స్ ప్రెస్ అగ్నిప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోవడం బాధాకరమన్నారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత సూచించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

టీవీ9 తో ఎర్నాకులం ఎక్స్ప్రెస్ అసిస్టెంట్ లోకో పైలట్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపిస్తున్న సమయంలో రైలు బ్రేక్ జామ్ అయిందన్నారు. వెంటనే వెనక్కి వెళ్లి చూసేసరికి భోగిల్లో మంటలు చెలరేగుతున్నాయని, ఘటనకు ముందు అనకాపల్లిలో ట్రైన్‌ ఆపు చేశామన్నారు. ఆ తర్వాత తుని రైల్వే స్టేషన్ రానుందని అన్నారు. ఈలోగా ఎలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద ఘటన జరిగినట్లు వెల్లడించారు.

టీవీ9తో డీఆర్ఎం మోహిత్ మాట్లాడుతూ.. రెండు కోచ్‌లు ఎఫెక్ట్ అయ్యాయి. ఆయా కోచ్ ల ప్రయాణికులను బస్సులలో అనకాపల్లికి తరలిస్తున్నాం. అందరిని గమ్య స్థానాలకు తరలించేందుకు ప్రత్యమన్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. అనకాపల్లి కి రెండు కరస్పాండింగ్ కోచ్ లను తెప్పిస్తున్నాం. ఎఫెక్ట్ అయినా కోచ్‌ల ఫ్రంట్ పోర్షన్ సిద్ధంగా ఉంది. రెండు అడిషనల్ కోర్టులతో పాటు వెనకున్న కోచ్ లను జోడించి రైలును పంపిస్తామని అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.