IPL 2025: చపాక్‌లో రాహుల్ విధ్వంసం..చెన్నై టార్గెట్ 184 పరుగులు
ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా జరుగుతన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ముందు 184 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.

IPL 2025: చెపాక్ వేదికగా జరుగుతన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై ముందు 184 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ ఈ మ్యాచ్‌లో తన సత్తా చాటాడు. చపాక్ స్టేడియంలో చెన్నై బౌలర్స్‌కు చుక్కలు చూపించాడు. 51 బంతుల్లో 6 ఫోర్లు , 3 సిక్స్‌లతో 77 పరుగులు సాధించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 రన్స్ చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ వేసిన బంతికి ఓపెనర్ జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్ డకౌట్‌గా వెనుదిరిగాడు. స్ట్రైక్‌లో ఉన్న రాహుల్, ఆ తర్వాత వచ్చిన అభిషేక్ పోరెల్‌తో కలిసి స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఇంతలో బౌలింగ్‌కు వచ్చిన జడేజా తన తొలి ఓవర్‌లోనే అభిషేక్ వికెట్ తీశాడు. తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ 14 బంతుల్లో 21 రన్స్ చేసి.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఇక సమీర్ రిజ్వీ 15 బంతుల్లో 20 రన్స్ చేసి వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన స్టబ్స్‌తో కలిసి రాహుల్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగుల చేసింది. అటు చెన్నై బౌలర్స్ లో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీయగా జడేజా, నూర్ అహ్మద్, పతిరన తలో వికెట్ పడగొట్టారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..