IPL 2025: ఏడాదిలోపే ఆ ఐపీఎల్ రికార్డ్ బ్రేక్.. బాంబ్ పేల్చిన టీమిండియా ప్లేయర్

IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) మెగా వేలానికి రంగం సిద్ధమైంది. అయితే, ఈసారి అత్యంత ఖరీదైన ఆటగాడి రికార్డు బద్దలవుతుందని టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్పాన్ పఠాన్ పేర్కొన్నాడు.

IPL 2025: ఏడాదిలోపే ఆ ఐపీఎల్ రికార్డ్ బ్రేక్.. బాంబ్ పేల్చిన టీమిండియా ప్లేయర్
Ipl 2025 Mega Auction
Follow us
Venkata Chari

|

Updated on: Nov 19, 2024 | 1:15 PM

IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) మెగా వేలానికి రంగం సిద్ధమైంది. ఒక వారం తర్వాత, అన్ని ఫ్రాంచైజీలు సౌదీ అరేబియాలోని జెడ్డాలో తమ క్యాంపులో స్టార్ ఆటగాళ్లను చేర్చుకోవడానికి పోటీపడుతుండడం కనిపిస్తుంది. ఈ క్రమంలో వెటరన్‌ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ భారీ అంచనాలు వేశాడు. ఈసారి అత్యంత ఖరీదైన ఆటగాడి రికార్డు బద్దలవుతుందని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2024 వేలంలో మిచెల్ స్టార్క్ ఈ రికార్డును నెలకొల్పాడు. కోల్‌కతా జట్టు రూ. 24.75 కోట్లు వెచ్చించి స్టార్క్‌ని తమ క్యాంపులో చేర్చుకుంది.

నిమిషాల వ్యవధిలోనే కమిన్స్ రికార్డు బద్దలు..

IPL 2023 వేలం ఉత్కంఠతో నిండిపోయింది. ఈ వేలంలో పాట్ కమిన్స్‌ను హైదరాబాద్ జట్టు రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అయితే కొన్ని నిమిషాల్లోనే స్టార్క్ ఈ రికార్డును ధ్వంసం చేశాడు. ఇప్పుడు ఈ రికార్డు ఏడాది వ్యవధిలో మరోసారి బద్దలవుతుందని ఇర్ఫాన్ పఠాన్ జోస్యం చెప్పుకొచ్చాడు.

స్టార్క్ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారు?

IPL 2025 మెగా వేలంలో చాలా మంది గొప్ప ఆటగాళ్లు హాజరు కానున్నారు. ఈ ఆటగాళ్ల కోసం జట్లు తప్పనిసరిగా సన్నద్ధమై ఉండాలి. ఇషాన్‌ కిషన్‌, మహమ్మద్‌ షమీ, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ సహా పలువురు ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. అయితే అందరి దృష్టి పంత్‌పైనే ఉంటుంది. ఇర్ఫాన్ పఠాన్ పంత్ పేరును కూడా పోస్ట్‌లో చేర్చాడు. అతను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో పోస్ట్ చేసి, ‘మిచెల్ స్టార్క్ వేలం రికార్డు ప్రమాదంలో ఉంది. రిషబ్ పంత్ దానిని బ్రేక్ చేయవచ్చిన తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

షాకిచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్..

ఐపీఎల్ మెగా వేలానికి ముందు రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. నిలుపుదల జాబితా విడుదలకు ముందే పంత్ ఈ విషయాన్ని సూచించాడు. పంజాబ్ కింగ్స్ వద్ద అతిపెద్ద పర్స్ ఉంది. మెగా వేలంలో జట్టుకు ఇంకా రూ.110 కోట్లు మిగిలి ఉన్నాయి. పంత్‌కు ఎంత ధర చెల్లిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!