LSG vs CSK, IPL 2024: జడేజా అర్ధ సెంచరీ.. ఆఖరులో ధోని ధనాధన్ బ్యాటింగ్.. లక్నో టార్గెట్ ఎంతంటే?

Lucknow Super Giants vs Chennai Super Kings: లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో57 నాటౌట్, 5 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధశతకంతో రాణిస్తే.. ఎప్పటిలాగే ఆఖరులో ధోని ( 9 బంతుల్లో 28 నాటౌట్, 3ఫోర్లు 2 సిక్సర్లు ) మెరుపులు మెరిపించాడు.

LSG vs CSK, IPL 2024: జడేజా అర్ధ సెంచరీ.. ఆఖరులో ధోని ధనాధన్ బ్యాటింగ్.. లక్నో టార్గెట్ ఎంతంటే?
Chennai Super Kings
Follow us

|

Updated on: Apr 19, 2024 | 9:30 PM

Lucknow Super Giants vs Chennai Super Kings: లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో57 నాటౌట్, 5 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధశతకంతో రాణిస్తే.. ఎప్పటిలాగే ఆఖరులో ధోని ( 9 బంతుల్లో 28 నాటౌట్, 3ఫోర్లు 2 సిక్సర్లు ) మెరుపులు మెరిపించాడు. దీంతో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.  ధోని 311.11 స్ట్రైక్ రేట్‌తో 2 సిక్స్‌లు, 3 ఫోర్లతో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొయిన్ అలీ జడేజాకు బాగా మద్దతు ఇచ్చాడు. మొయిన్ 20 బంతుల్లో 30 పరుగులు జోడించాడు. మొయిన్ ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు ఉన్నాయి. అంతకు ముందు ఓపెనర్ అజింక్య రహానే 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 36 పరుగులు చేశాడు. కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ 13 బంతుల్లో 17 పరుగులు చేశాడు. రరచిన్ 0, శివమ్ 3, రిజ్వీ 1 పరుగులతో నిరాశపర్చారు.  లక్నో బౌలర్లలో కృనాల్‌ 2 వికెట్లు పడగొట్టగా.. మోసిన్‌, యశ్‌ ఠాకూర్‌, బిష్ణోయ్‌, స్టోయినిస్‌ తలో వికెట్‌ తీశారు.

ఇవి కూడా చదవండి

ధోని ధనా ధన్ బ్యాటింగ్.. వీడియో..

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్:

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివన్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా.

ఇంపాక్ట్ ప్లేయర్:

సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, మిచెల్ సాంట్నర్.

లక్నో సూపర్‌జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవన్:

క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.

ఇంపాక్ట్ ప్లేయర్:

అర్షిన్ కులకర్ణి, కృష్ణప్ప గౌతమ్, యద్వీర్ సింగ్, మణి రామన్ సిద్ధార్థ్, అర్షద్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి