IPL 2024: 9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్.. లిస్ట్ చూస్తే 2004 ధోని అనాల్సిందే..

IPL 2024 MS Dhoni: దీంతో పాటు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ రికార్డును కూడా ధోనీ బద్దలు కొట్టాడు. నిజానికి ఐపీఎల్‌లో ఏబీ డివిలియర్స్ 5162 పరుగులు చేశాడు. ఇప్పుడు పరుగుల పరంగా డివిలియర్స్‌ను ధోనీ అధిగమించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో యాక్టివ్‌గా ఉన్న ధోనీ ఇప్పటివరకు ఆడిన 257 మ్యాచ్‌ల్లో 223 ఇన్నింగ్స్‌ల్లో 5169 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 5000 పరుగులు పూర్తి చేసిన ఏకైక వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్. ఇప్పుడు ఈ జాబితాలో ధోనీ చేరాడు.

IPL 2024: 9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్.. లిస్ట్ చూస్తే 2004 ధోని అనాల్సిందే..
Kl Rahul Vs Ms Dhoni 4
Follow us

|

Updated on: Apr 20, 2024 | 1:59 PM

IPL 2024 MS Dhoni: ఐపీఎల్ 2024 32వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 57 పరుగులతో జట్టుకు ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడగా, లోయర్ ఆర్డర్‌లో మోయిన్ అలీ 30 పరుగులు చేశాడు. అతనితో పాటు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన మాజీ కెప్టెన్ ధోనీ కూడా 28 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్‌లో సరికొత్త మైలురాయిని నెలకొల్పాడు.

ఈ మ్యాచ్‌లో ధోనీ కేవలం 9 బంతులు మాత్రమే ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 28 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్‌లో వికెట్‌కీపర్‌గా 5000 పరుగులు పూర్తి చేసిన ఏకైక భారత ఆటగాడిగా ధోనీ నిలిచాడు.

దీంతో పాటు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ రికార్డును కూడా ధోనీ బద్దలు కొట్టాడు. నిజానికి ఐపీఎల్‌లో ఏబీ డివిలియర్స్ 5162 పరుగులు చేశాడు. ఇప్పుడు పరుగుల పరంగా డివిలియర్స్‌ను ధోనీ అధిగమించాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఐపీఎల్‌లో యాక్టివ్‌గా ఉన్న ధోనీ ఇప్పటివరకు ఆడిన 257 మ్యాచ్‌ల్లో 223 ఇన్నింగ్స్‌ల్లో 5169 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 5000 పరుగులు పూర్తి చేసిన ఏకైక వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్. ఇప్పుడు ఈ జాబితాలో ధోనీ చేరాడు.

దీంతో పాటు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో ధోనీ ఇప్పుడు ఆరో స్థానానికి చేరుకున్నాడు. ధోనీతో పాటు సురేశ్ రైనా (5528 పరుగులు), రోహిత్ శర్మ (6508 పరుగులు), డేవిడ్ వార్నర్ (6563 పరుగులు), శిఖర్ ధావన్ (6769 పరుగులు), విరాట్ కోహ్లీ (7624 పరుగులు) ఈ జాబితాలో ఉన్నారు.

ఇరు జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కీపర్/కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..