DC vs SRH: టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు: మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..

Delhi Capitals vs Sunrisers Hyderabad: ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించగా, 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు వద్ద 6 పాయింట్లు ఉన్నాయి. కానీ, వారు తమ గత రెండు మ్యాచ్‌లను గెలుచుకున్నారు. ఈసారి వారి జోరు కొనసాగాలని కోరుకుంటున్నారు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. వారికి 8 పాయింట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి రెండవ స్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తుంది.

DC vs SRH: టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు: మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..
Dc Vs Srh
Follow us

|

Updated on: Apr 20, 2024 | 1:47 PM

Delhi Capitals vs Sunrisers Hyderabad: IPL 2024 లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. దీనిపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ తీరు చూస్తుంటే ఈసారి కూడా 300 పరుగులు చేయగలమని చెప్పవచ్చని అన్నాడు. ఆకాష్ చోప్రా ప్రకారం, ఢిల్లీ మైదానం చిన్నది. ఇటువంటి పరిస్థితిలో, సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ దానిని పూర్తి ప్రయోజనాన్ని పొందగలరు.

ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించగా, 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు వద్ద 6 పాయింట్లు ఉన్నాయి. కానీ, వారు తమ గత రెండు మ్యాచ్‌లను గెలుచుకున్నారు. ఈసారి వారి జోరు కొనసాగాలని కోరుకుంటున్నారు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. వారికి 8 పాయింట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి రెండవ స్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తుంది.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రికార్డు సృష్టించింది. RCBతో జరిగిన మ్యాచ్‌లో 287 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. ఆ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో పరుగులు వర్షమే – ఆకాష్ చోప్రా..

ఆకాష్ చోప్రా ప్రకారం, ఈసారి కూడా హైదరాబాద్ నుంచి అదే రకమైన తుఫాన్ బ్యాటింగ్ చూడవచ్చు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ సొంతమైదానంలోనే కాదు.. ప్రత్యర్థుల మైదానంలోనూ దంచి కొడుతున్నారు. గతసారి బెంగళూరులో 287 పరుగుల రికార్డ్ స్కోరే ఇందుకు కారణంగా నిలిచింది. ట్రావిస్ హెడ్ కూడా త్వరలో 300 ఫిగర్ సాధిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మైదానం కూడా భారీ షాట్లు ఆడటానికి వీలుగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో చాలా ఉత్కంఠభరితమైన పోటీని చూడవచ్చు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ మంచి జోరుతో బరిలోకి దిగడమే ఇందుకు కారణం’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్/సుమిత్ కుమార్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ట్రిస్టన్ స్టబ్స్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కీపర్/కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.

ఇంపాక్ట్ ప్లేయర్: అభిషేక్ పోరెల్.

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి. నటరాజన్.

ఇంపాక్ట్ ప్లేయర్: మయాంక్ మార్కండే.

స్క్వాడ్‌లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, ఉపేంద్ర యాదవ్, ఝటావేద్ సుబ్రమణ్యన్, సన్వీర్ సింగ్, విజయకాంత్ వియాస్కాంత్, ఫజల్హాక్ ఫరూఖీ, మార్కో జాన్సెన్, ఆకాష్ మహరాజ్ సింగ్, మయాంక్ అగర్వాల్.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), సుమిత్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, కుమార్ కుషాగ్రా, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్, లిజాద్ విలియమ్స్, డేవిడ్ వార్నర్, ఝే రిచర్డ్‌సన్, అన్రిచ్ నార్ట్జే, యష్ ధుల్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, రసిఖ్ దార్ సలామ్, విక్కీ ఓస్త్వాల్, స్వస్తిక్ చికారా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు