AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ధోని నుంచి ఇది అసలు ఊహించలేదు.. ఆర్సీబీ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని మిస్టర్ కూల్.. వీడియో

Royal Challengers Bengaluru vs Chennai Super Kings:  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం (మే 18) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించి ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించింది.

IPL 2024: ధోని నుంచి ఇది అసలు ఊహించలేదు.. ఆర్సీబీ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని మిస్టర్ కూల్.. వీడియో
MS Dhoni
Basha Shek
|

Updated on: May 19, 2024 | 6:55 PM

Share

Royal Challengers Bengaluru vs Chennai Super Kings:  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం (మే 18) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించి ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించింది. ఈ విజయం తర్వాత సీఎస్‌కే జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్సీబీ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు మిస్టర్ కూల్ ధోని నుంచి ఇది అసలు ఊహించలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మ్యాచ్ అనంతరం సీఎస్‌కే ఆటగాళ్లు కరచాలనం చేసేందుకు బారులు తీరారు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ ముందు వరుసలో ఉన్నాడు. అయితే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. దీంతో ఆర్సీబీ ఆటగాళ్ల కోసం ఎదురుచూడకుండా మహేంద్ర సింగ్ ధోనీ పెవిలియన్ బాట పట్టాడు. ఈ సమయంలో ధోనీ ఆర్సీబీ సిబ్బందితో కరచాలనం చేసి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు. ఇప్పుడు ఆర్సీబీ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ధోనీ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై ఆర్సీబీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదుసార్లు కప్ గెలిచిన తర్వాత కూడా ఇలా చేయడం ఏమీ బాగోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చెన్నై ఆటగాళ్లు ఆర్సీబీ ఆటగాళ్లతో కరచాలనం చేస్తున్న వేళ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం డ్రెస్సింగ్ రూమ్‌లో ఒంటరిగా కూర్చున్నాడు. అయితే విరాట్ కోహ్లీ మరీ అక్కడికి వెళ్లి ధోనీతో కరచాలనం చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో…

చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించడానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సి ఉంది. కానీ చివరి ఓవర్‌లో యశ్ దయాల్ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. మార్చి 22న జరిగే ప్లేఆఫ్స్‌లో RCB రాజస్థాన్ రాయల్స్ లేదా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది

ఆనందంలో కోహ్లీ, అనుష్క… వీడియో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..