Aadujeevitham OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి పృథ్వీరాజ్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఆడు జీవితం స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మలయాళ సూపర్ స్టార్, సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితం (ది గోట్ లైఫ్). కేరళ నుంచి సౌదీకి వలస వెళ్లిన ఒక కూలీ పడే కష్టాల సమహారంతో దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ ఏడాది మార్చి 28న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఆడు జీవితం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Aadujeevitham OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి పృథ్వీరాజ్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఆడు జీవితం స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Aadujeevitham Movie
Follow us
Basha Shek

|

Updated on: May 18, 2024 | 9:35 PM

మలయాళ సూపర్ స్టార్, సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితం (ది గోట్ లైఫ్). కేరళ నుంచి సౌదీకి వలస వెళ్లిన ఒక కూలీ పడే కష్టాల సమహారంతో దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ ఏడాది మార్చి 28న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఆడు జీవితం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మలయాళంలో అత్యంత వేగంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాగా రికార్డులకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 200 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. స్ట్రాంగ్ కంటెంట్ ఉండడంతో తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేయగా, ఇక్కడ కూడా ఓ మోస్తరు గానే కలెక్షన్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ ను ఎంతగానో అలరించిన ఆడు జీవితం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా విడుదలై సుమారు రెండు నెలలు గడుస్తున్నాఇంతవరకు అధికారిక ఓటీటీ రిలీజ్ డేట్ రాలేదు. మే 10న పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తుందని చాలా మంది భావించారు . అయితే అదేమీ జరగలేదు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆడు జీవితం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 26 నుంచి ఈ బ్లాక్ బస్టర్ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు టాక్ నడుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందట.

ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన అమలా పాల్ కథానాయికగా నటించింది. అలాగే హాలీవుడ్ నటులు జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, ఆల్టా గ్లోబల్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చడం విశేషం. కేరళకు నుండి దుబాయికి సంపాదించుకోవడం కోసం వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ బానిసత్వం ఎదుర్కొంటాడు. అక్కడ నుండి ఎడారి మార్గం ద్వారా ఇండియా బయలు దేరతాడు. మరి అతను తన సొంతూరుకు చేరుకున్నాడా? మార్గమధ్యంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేదే సినిమా కథ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్