Prabhas: బుజ్జిని పరిచయం చేసిన భైరవ.. ప్రభాస్ జీవితంలో చాలా స్పెషల్… ఎవరంటే?

పాన్‌ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Prabhas: బుజ్జిని పరిచయం చేసిన భైరవ.. ప్రభాస్ జీవితంలో చాలా స్పెషల్... ఎవరంటే?
Prabhas Kalki 2898 Ad Movie
Follow us
Basha Shek

|

Updated on: May 18, 2024 | 10:56 PM

పాన్‌ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న కల్కి మే 09న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో జూన్ 27కు వాయిదా పడింది. అయితే సినిమా పోస్ట్ పోన్ అయినా క్రేజీ అప్ డేట్స్ తో అభిమానులను అలరిస్తున్నారు కల్కి మేకర్స్. దీంతో ప్రభాస్ మూవీ గత కొన్ని రోజులుగా ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. ఇక కొన్ని గంటల క్రితం హీరో ప్రభాస్ సైతం వరుసగా పోస్ట్ లు షేర్ చేశాడు. ‘ఎట్టకేలకు మన లైఫ్ లోకి ఓ స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. వెయిట్‌ చేయండి.’ అని మొదట, ఆ తర్వాత ‘నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.’ అంటూ మరో పోస్ట్‌ పెట్టాడు. దీంతో అసలు బుజ్జి ఎవరు..? ఎలా ఉంటుంది..? అని ఫ్యాన్స్ లో కుతుహలం పెరిగింది. అదే సమయంలో కల్కి సినిమా మేకింగ్ సంబంధించి ఆసక్తికర వీడియోలతో స్క్రాచ్ అంటూ కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలా తాజాగా ఇంట్రెస్టింగ్ వీడియో ఎపిసోడ్ 4 తో వచ్చారు. ఇందులో ప్రభాస్ చెప్పిన బుజ్జి ఎవరో చాలా సేపు వెయిట్ చేయించి రివీల్ చేశారు.

ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగిన ఈ గ్లింప్స్ విడియోలో ఒక చిన్న రోబోను బుజ్జి అని అందరూ పిలుస్తూ ఉంటారు. ఇక్కడ విశేషమేమిటంటే… బుజ్జిక మహానటి కీర్తి సురేష్‌ వాయిస్ ఓవర్ ఇచ్చింది. ‘నా లైఫ్‌ ఎంటి..? బాడీ లేకుండా బతికేయాల్సిందేనా’ అంటూ బుజ్జి చెబుతుండగా ఇంతలో ప్రభాస్‌ ఎంట్రీ ఇస్తాడు.. ‘నీ టైమ్‌ మొదలైంది బుజ్జి’ అంటూ తన వాహనం గురించి చెప్పబోతాడు. అయితే ఇంతలోనే ట్విస్ట్‌ ఇస్తూ బుజ్జి గురించి మరింతగా తెలుసుకోవాలంటే మే 22 వరకు వేచి ఉండాల్సిందేనంటూ మరో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

కల్కి నుంచి క్రేజీ అప్డేట్..

బుజ్జి ఎవరంటే.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.