Gongadi Trisha: తన అవార్డులను తండ్రికి అంకితమిచ్చిన త్రిష.. కూతురు కల సాకారం చేసేందుకు ఆయన ఇంత కష్టపడ్డారా?
పురుషులకు కూడా సాధ్యం కాని విధంగా అండర్ 19 భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెల్చుకుంది. ఈ రెండు విజయాల్లోనూ తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. 2023లో జరిగిన అండర్ 19మహిళల టీ20 ప్రపంచకప్ లో నిలకడగా ఆడిన త్రిష గొంగడి ఈసారి కూడా మెరుపులు మెరిపించింది.

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అండర్-19 మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను వరుసగా రెండోసారి గెలుచుకుంది. ఇంతకుముందు, ఈ టోర్నమెంట్ మొదటి ఎడిషన్ 2023 లో జరిగింది. షెఫాలీ వర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు వరుసగా రెండోసారి భారత్ ఈ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. భారత జట్టు సాధించిన ఈ రెండు అద్భుత విజయాల్లోనూ తెలంగాణలోని భద్రాచలం కు చెందిన గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. 2023 ప్రపంచకప్ టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన త్రిష 23.20 సగటుతో 116 పరుగులు సాధించింది. ఫైనల్లోనూ 24 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఈ టోర్నీలోనూ ఆమె టాప్ స్కోరర్ గా నిలిచింది. ఏడు మ్యాచుల్లో 77 సగటుతో మొత్తం 309 పరుగులు సాధించింది. అంతేకాదు తన స్పిన్ బౌలింగ్ తో ఏడు వికెట్లు పడగొట్టింది. ఇక ఫైనల్ మ్యాచ్ లోనూ మూడు వికెట్ల పడగొట్టింది. బ్యాటింగ్ లోనూ రాణించి 44 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఈ తెలంగాణ అమ్మాయికే వచ్చాయి. కాగా మ్యాచ్ తర్వాత త్రిష మాట్లాడుతూ.. మిథాలి రాజ్ తనకు రోల్ మోడల్ అని పేర్కొన్నారు. తనకు సహకరించిన టీమ్ సభ్యులందరికీ ధన్యవాదాలని త్రిష పేర్కొంది. తన తండ్రికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డును అంకితం చేస్తున్నానంది త్రిష.
కూతురు కల కోసం ఉద్యోగం, సొంతూరును వదిలి..
కాగా భారత జట్టు విజయంతో త్రిష ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. తమ బిడ్డ రాణించడమే కాకుండా భారత జట్టుకు విజయాన్ని అందించిందని ఆనందం వ్యకం చేస్తోంది. కాగా తన కుమార్తెను ఏదో ఒక స్పోర్ట్‌లో రాణించేలా ప్రోత్సహించాలని భావించిన రామిరెడ్డి తొలుత టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడేలా త్రిషను ప్రోత్సాహించారు. కానీ, కూతురు సత్తా, ఉత్సాహం చూసి.. తను క్రికెట్‌కు బాగా సరిపోతుందని గుర్తించారు. త్రిషకు రెండున్నరేళ్ల వయసులో ప్లాస్టిక్ బాల్, బ్యాట్‌తో ఆయనే శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఐదేళ్ల వయసొచ్చాక తనతోపాటు గ్రౌండ్‌కు తీసుకెళ్లి.. రోజుకు మూడొందల బంతులను త్రిషకు వేసేవారు. ఆ తర్వాత సిమెంట్ పిచ్‌ను ఏర్పాటు చేసి త్రిషతో ప్రాక్టీస్ చేయించేవారు. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన రెండేళ్ల లోపే త్రిష హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఆడింది. ఆ తర్వాతి ఏడాదే అండర్-19, అండర్-23లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అటుపై అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో ఆడే అవకాశం త్రిషకు లభించింది.
తండ్రితో గొంగడి త్రిష..
View this post on Instagram
ప్రపంచకప్ టోర్నీలో త్రిష రికార్డులు..
- టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్
- మొత్తం 309 రన్స్ చేసిన త్రిష
- బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా రాణింపు
- టోర్నీలో 7 వికెట్లు తీసిన త్రిష
- ఫైనల్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
- ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా త్రిషకే
- ఇటీవల జరిగిన ఆసియా కప్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
ఇక విశాఖకు చెందిన మరో తెలుగు తేజం షకీల్ షబ్నమ్ కూడా…ఈ అండర్ 19 టీ-20 వరల్డ్ కప్ ఫైనల్లో సత్తా చాటింది. బౌలర్ అయిన షబ్నమ్..ఒక వికెట్ తీసింది. షబ్నమ్‌ని, త్రిషని అభినందిస్తూ ఏపీ హోం మంత్రి అనిత ట్వీట్ చేశారు.
అభినందనల వెల్లువ..
అండర్ -19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అభినందనలు. మేటి జట్లను మట్టి కరిపించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన అద్భుతమైన సందర్భంలో మన తెలుగు తేజాలు విశాఖకు చెందిన షబ్నమ్ షకీల్, తెలంగాణకు చెందిన గొంగడి… pic.twitter.com/VDNKq6pf4H
— Anitha Vangalapudi (@Anitha_TDP) February 2, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..