ICC Rankings: దూసుకొచ్చిన యంగ్ సెన్సేషన్‌.. టాప్‌లో ఏకంగా ఐదుగురు టీమిండియా క్రికెటర్లు.. లిస్ట్‌ ఇదే

ఐసీసీ కొత్త ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. మూడు ఫార్మాట్లకు సంబంధించి కొత్త ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఎప్పటిలాగే ఈ కొత్త ర్యాంకింగ్ జాబితాలో టీమిండియా ఆటగాళ్లదే ఆధిపత్యం కొనసాగింది. ఈసారి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు అగ్రస్థానంలో నిలవడం విశేషం. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉంటే

ICC Rankings: దూసుకొచ్చిన యంగ్ సెన్సేషన్‌.. టాప్‌లో ఏకంగా ఐదుగురు టీమిండియా క్రికెటర్లు.. లిస్ట్‌ ఇదే
Team India
Follow us
Basha Shek

|

Updated on: Dec 06, 2023 | 9:11 PM

ఐసీసీ కొత్త ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. మూడు ఫార్మాట్లకు సంబంధించి కొత్త ర్యాంకింగ్స్‌ను బుధవారం (డిసెంబర్ 6) ప్రకటించింది. ఎప్పటిలాగే ఈ కొత్త ర్యాంకింగ్ జాబితాలో టీమిండియా ఆటగాళ్లదే ఆధిపత్యం కొనసాగింది. ఈసారి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు అగ్రస్థానంలో నిలవడం విశేషం. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉంటే, టీ20 క్రికెట్ బ్యాటర్ల విభాగంలో సూర్యకుమార్ యాదవ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ టాప్-1లో ఉండగా, టెస్టు ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే టీ20 బౌలర్ల జాబితాలో టీమిండియా నయా సెన్సేషన్‌ రవి బిష్ణోయ్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన ఈ యంగ్‌ స్పిన్నర్.. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నాడు.

ఇవి కాకుండా, ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 223 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ టీ20 క్రికెట్ ర్యాంకింగ్‌లో 7వ స్థానంలో నిలిచాడు. అలాగే టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు. దీని ప్రకారం ఐసీసీ కొత్త టాప్-10 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.

ఇవి కూడా చదవండి

T20 బ్యాటర్స్ ర్యాంకింగ్:

  • సూర్యకుమార్ యాదవ్ (1వ స్థానం)
  • రుతురాజ్ గైక్వాడ్ (7వ స్థానం)

T20 బౌలర్ల ర్యాంకింగ్:

  • రవి బిష్ణోయ్ (1వ స్థానం)

వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్:

  • శుభ్‌మాన్ గిల్ (1వ స్థానం)
  • విరాట్ కోహ్లీ (3వ స్థానం)
  • రోహిత్ శర్మ (4వ స్థానం)

T20 ఆల్ రౌండర్ల ర్యాంకింగ్:

  • హార్దిక్ పాండ్యా (3వ స్థానం)

టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్:

  • రోహిత్ శర్మ (10వ స్థానం)

టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్:

  • రవిచంద్రన్ అశ్విన్ (1వ స్థానం)
  • రవీంద్ర జడేజా (3వ స్థానం)

టెస్ట్ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్:

  • రవీంద్ర జడేజా (1వ స్థానం)
  • రవిచంద్రన్ అశ్విన్ (2వ)
  • అక్షర్ పటేల్ (5వ స్థానం)

రషీద్ ను పక్కనెట్టిన రవి బిష్ణోయ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..