Virat – Gambhir: నాడు గొడవలతో భీకర పోరు.. నేడు క్యూట్ స్మైల్‌తో ఫిదా చేస్తోన్న కోహ్లీ, గంభీర్.. వైరల్ వీడియో
Virat Kohli - Gautam Gambhir Interview: బంగ్లాదేశ్ సిరీస్ ప్రారంభానికి ముందు, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ అభిమానుల కోసం ఓ ఇంటర్వ్యూను అందించారు. భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ల ఈ ఆసక్తికరమైన ఇంటర్వ్యూ పూర్తి వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఈ 19 నిమిషాల వీడియోలో, ఇద్దరు అనుభవజ్ఞుల మధ్య వారి కెరీర్‌లోని కొన్ని సరదా సంఘటనలు చర్చించారు.
Virat Kohli – Gautam Gambhir Interview: బంగ్లాదేశ్ సిరీస్ ప్రారంభానికి ముందు, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ అభిమానుల కోసం ఓ ఇంటర్వ్యూను అందించారు. భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ల ఈ ఆసక్తికరమైన ఇంటర్వ్యూ పూర్తి వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఈ 19 నిమిషాల వీడియోలో, ఇద్దరు అనుభవజ్ఞుల మధ్య వారి కెరీర్‌లోని కొన్ని సరదా సంఘటనలు చర్చించారు. కోహ్లీ కెరీర్‌లో చిరస్మరణీయమైన క్షణాలను, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అద్భుత ప్రదర్శనను గుర్తు చేసుకుంటూ గంభీర్ ఇంటర్వ్యూను ప్రారంభించాడు. పాకిస్థాన్‌పై విరాట్ 183 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌ను వన్డేల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా గంభీర్ అభివర్ణించాడు.
పాకిస్థాన్‌పై 183 పరుగుల ఇన్నింగ్స్ కీలకం..
2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై ఆడిన 183 పరుగులతో విరాట్ కోహ్లీ చేసిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను ఏ భారతీయుడు ఆడిన అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్‌గా గంభీర్ అభివర్ణించాడు. గంభీర్ మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడ కూర్చున్నందున ఈ విషయం చెప్పడం లేదు. 300+ పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో పాకిస్థాన్‌పై అలాంటి ఇన్నింగ్స్ ఆడటం కష్టం. అది కోహ్లీ ప్రత్యేకత. ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిది, సయీద్ అజ్మల్, వహాబ్ రియాజ్ వంటి ప్రమాదకరమైన బౌలర్‌లతో కూడిన బౌలింగ్ యూనిట్‌ను విరాట్ ఒంటరిగా చిత్తు చేశాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. 330 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కోహ్లీ 148 బంతుల్లో 22 ఫోర్లు, 1 సిక్స్‌తో మొత్తం 183 పరుగులు చేయడంతో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చిరస్మరణీయ ఇన్నింగ్స్‌పై ఏమన్నాడంటే..
When an unstoppable force meets an immovable object—cricket’s greatest paradox, personified! 👌 👌
Presenting an iconic interaction between #TeamIndia Head Coach @GautamGambhir & the legendary @imVkohli 👏 👏 – By @RajalArora & @Moulinparikh#INDvBAN | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) September 18, 2024
విరాట్ కోహ్లీ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ను గౌతమ్ గంభీర్ ప్రస్తావిస్తూ, ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ గొప్ప సిరీస్ ఆడింది నాకు గుర్తుంది. అందులో చాలా పరుగులు చేశాడు. నేపియర్ అద్భుతమైన టెస్ట్ ఇన్నింగ్స్‌ను ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ తెలిపాడు.
ఇద్దిర మధ్య గొడవలపై..
మైదానంలో కోహ్లి ఫైట్స్‌ని హైలైట్ చేస్తూ గంభీర్ సరదాగా మాట్లాడుతూ.. ‘నాకంటే ఎక్కువ ఫైట్స్ చేశావు. ఈ ప్రశ్నకు మీరు నాకంటే బాగా సమాధానం చెప్పగలరు అంటూ నవ్వేశాడు. అయితే, ఈ విషయంపై ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ, ‘నా అభిప్రాయంతో ఏకీభవించే వారి కోసం వెతుకుతున్నాను. అది తప్పు అని నేను అనడం లేదు. ‘అవును, ఇదే సరైన మార్గం’ అని చెప్పే వారి కోసం నేను వెతుకుతున్నాను అంటూ తెలిపాడు. ఈ ఇద్దరి మధ్య గతంలో చాలా గొడవలు జరిగాయని తెలిసిందే. అయితే, ఈ సంభాషణను బట్టి ఇప్పుడు ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని తేలిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..