Aus vs Pak: ఆసీస్ దెబ్బకు పాకిస్థాన్‌ ఘోర పరాజయం.. కట్‌చేస్తే.. అగ్రస్థానానికి చేరిన భారత జట్టు..

WTC 2025: ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేస్తే, పాట్ కమిన్స్ సేన కూడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో అగ్రస్థానం పొందే అవకాశం ఉంది. టీమిండియాతో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా దక్షిణాఫ్రికా కూడా పాయింట్ల పట్టికలో ఖాతా తెరవనుంది. తద్వారా ఈ ఏడాది చివర్లో జరగనున్న టెస్టు సిరీస్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పును తీసుకురాగలదు.

Aus vs Pak: ఆసీస్ దెబ్బకు పాకిస్థాన్‌ ఘోర పరాజయం.. కట్‌చేస్తే.. అగ్రస్థానానికి చేరిన భారత జట్టు..
Wtc 2024 Pak Vs Ind
Follow us
Venkata Chari

|

Updated on: Dec 18, 2023 | 10:33 AM

WTC 2025 Points Table: పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేయగా, పాకిస్థాన్ 271 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 449 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు కేవలం 89 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 360 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

టీమ్ ఇండియాకు ప్లస్ పాయింట్..

ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ ఘోర పరాజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియాకు ప్లస్ పాయింట్ అయింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌కు ముందు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు ఘోర పరాజయంతో పాక్ జట్టు రెండో స్థానానికి పడిపోయింది. 2వ స్థానంలో ఉన్న టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది.

ప్రస్తుత పాయింట్ల పట్టికలో భారత్ గెలుపు శాతం 66.67% కాగా, పాకిస్థాన్ గెలుపు శాతం కూడా 66.67%. తద్వారా తదుపరి మ్యాచ్‌లో పాక్‌ జట్టు మళ్లీ అగ్రస్థానానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, మరోసారి ఓటమిపాలైతే.. ఖాతాలో పాయింట్లు మరోసారి తగ్గే అవకాశం ఉంది. దీంతో పాక్ జట్టు రెండో స్థానం నుంచి పడిపోయే ప్రమాదం కూడా ఉంది.

అయితే, డిసెంబర్ నెలాఖరులో దక్షిణాఫ్రికాతో టీమిండియా టెస్టు సిరీస్ కూడా ఆడనుంది. తద్వారా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా పాకిస్థాన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నప్పటికీ.. టీమ్ ఇండియా మళ్లీ నంబర్ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.

ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేస్తే, పాట్ కమిన్స్ సేన కూడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో అగ్రస్థానం పొందే అవకాశం ఉంది. టీమిండియాతో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా దక్షిణాఫ్రికా కూడా పాయింట్ల పట్టికలో ఖాతా తెరవనుంది. తద్వారా ఈ ఏడాది చివర్లో జరగనున్న టెస్టు సిరీస్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పును తీసుకురాగలదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..