Ind vs Aus: వామ్మో..ఏంటి భయ్యా ఈ ఎక్స్‌ప్రెషన్.. పిల్లలు జడుసుకోరు! వైరలవుతోన్న విరాట్ రియాక్షన్
India vs Australia: ఈ మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఇచ్చిన ఒక ఎక్స్‌ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్‌లతో మీమ్స్ క్రియేట్ చేస్తూ తెగ హల్‌చల్ చేస్తున్నారు.
India vs Australia: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఒక్క అక్షర్ పటేల్ తప్ప హర్షల్ పటేల్ , యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో భారత జట్టు 208 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఇచ్చిన ఒక ఎక్స్‌ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్‌లతో మీమ్స్ క్రియేట్ చేస్తూ తెగ హల్‌చల్ చేస్తున్నారు. వివరాల్లోకి 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కింది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఉమేశ్‌యాదవ్‌ను ఆసీస్ కొత్త కుర్రాడు కామెరున్ గ్రీన్ చుక్కలు చూపించాడు. ఉమేశ్ వేసిన రెండో ఓవర్‌లో మొదటి నాలుగు బంతులను బౌండరీలకు పంపించాడు. దీంతో ఉమేశ్ యాదవ్ మొహం మాడిపోయింది. అదే సమయంలో కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఏంటి ఉమేశ్‌ఈ బౌలింగ్’ అన్నట్లుగా చిత్ర విచిత్రంగా కళ్లతో ఓ భయంకరమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.
కాగా విరాట్ రియాక్షన్‌పై నెట్టింట తెగ మీమ్స్ సందడి చేస్తున్నాయి. ‘ఏంటి భయ్యా.. ఈ ఎక్స్‌ప్రెషన్ పిల్లలు జడుసుకోరు’, ‘ఎప్పుడైనా పిల్లలు అన్నం తినకపోతే.. బూచోడికి పట్టిస్తా అని విరాట్ ఫొటో చూపిస్తారేమో’19వ ఓవర్‌లో భువీ బౌలింగ్ చూసి అందరూ కోహ్లి లాంటి లుక్కే ఇస్తారు. విరాట్ కెప్టెన్సీలో భారత జట్టు 200 పరుగులు చేసినప్పుడు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అందుకే ఈ ఎక్స్‌ప్రెషన్’ అంటూ నెటిజన్ల రకరకాల మీమ్స్‌ను సృష్టిస్తున్నారు. మరి కోహ్లీ రియాక్షన్‌పై వస్తోన్న ఈ సరదా మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
#INDvsAUS When you hear “Sabhi pitt rahe hai ek do over kohli se karwa lo”… pic.twitter.com/OX1kxL8OMY
— ?? رومانا (@RomanaRaza) September 20, 2022
All Indians when they see Bhuvi bowling 19th over every time. #Bhuvi #INDvsAUS #INDvAUS #ViratKohli? pic.twitter.com/fxVZbhOOZH
— Faizan Mushtaq (@faizanmushtaq77) September 20, 2022
All Indians when they see Bhuvi bowling 19th over every time. #Bhuvi #INDvsAUS #INDvAUS #ViratKohli? pic.twitter.com/fxVZbhOOZH
— Faizan Mushtaq (@faizanmushtaq77) September 20, 2022
When mom says “Maine chaipatti ke dibbe me paise rakhe the kisne nikale” Meanwhile me : pic.twitter.com/SlcFg2ctsW
— Rohit ? (@Rohit_ke_memes) September 20, 2022
Dad starts beating Me : siblings : pic.twitter.com/PJeB9XAsCa
— ??????? (@aakash_lakhia) September 20, 2022
Dad starts beating Me : siblings : pic.twitter.com/PJeB9XAsCa
— ??????? (@aakash_lakhia) September 20, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..