Watch Video: నిన్ను నమ్ముకుంటే కొంపలు మునిగినట్టే.. కార్తీక్‌పై హిట్‌మ్యాన్ ఆగ్రహం.. దవడలు నొక్కేస్తూ వార్నింగ్..
India vs Australia 1st T20I: తొలి టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బౌలింగ్ రాణించకపోవడంతో ఆస్ట్రేలియా 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
మొహాలీ వేదికగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. స్వదేశంలో సిరీస్‌లో విజయం సాధించగలమనే భారత్ ఆశలకు, ఆస్ట్రేలియా భంగం కలిగించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు భారత బౌలర్లను చిత్తు చేయడంతో భారత్ 208 పరుగులు చేసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. కాగా, ఈ మ్యాచ్ సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గందరగోళంగా కనిపించాడు. అతను వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌పై చాలా కోపంగా కనిపించాడు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. హార్దిక్ పాండ్యా అజేయంగా 71 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో పాండ్యా 30 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. కేఎల్ రాహుల్ 35 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తరపున కామెరాన్ గ్రీన్ 30 బంతుల్లో 61 పరుగులు, మాథ్యూ వేడ్ 45 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
tough love pic.twitter.com/o1BYZrTZw8
— Sritama (Ross Taylor’s version) (@cricketpun_duh) September 20, 2022
కార్తీక్ దవడ పట్టుకుని కడిగేసిన రోహిత్..
భారత బౌలర్లు విపరీతంగా పరుగులు కొల్లగొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు ఒక వికెట్ అవసరం. 11వ ఓవర్‌లో గ్రీన్‌ను అక్షర్ పటేల్ అవుట్ చేయగా, రోహిత్ ఉమేష్ యాదవ్‌ను బౌలింగ్‌లో తీసుకొచ్చాడు. ఉమేష్ వేసిన ఓవర్ మూడో బంతికి స్టీవ్ స్మిత్ క్యాచ్ ఇచ్చాడు. కార్తీక్ ఈ క్యాచ్ పట్టాడు. అయితే అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో టీమ్ రివ్యూ నిర్వహించగా స్మిత్ ఔట్ అయ్యాడు. దీని తర్వాత అదే ఓవర్ చివరి బంతికి గ్లెన్ మాక్స్‌వెల్‌తో అదే జరిగింది. అయితే ఈసారి కూడా అంపైర్ ఔట్ ఇవ్వలేదు. రోహిత్ రివ్యూ తీసుకున్నాడు. అందులో మ్యాక్స్‌వెల్ దొరికాడు. ఈ రెండు సమీక్షల సమయంలో కార్తీక్ పెద్దగా అప్పీల్ చేయలేదు. దీనికి సంబంధించి, రోహిత్ కార్తీక్‌పై భయాన్ని ప్రదర్శించాడు. అతని మెడ, దవడ పట్టుకుని గట్టిగా నొక్కేశాడు. మాక్స్‌వెల్ విషయంలో టీమ్ ఇండియా రివ్యూ తీసుకున్న సందర్భంలో ఇలాంటి సరదా సంఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ రెండు విషయాల్లోనూ దినేష్ కార్తీక్.. సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని, అందుకు రోహిత్, ఇలా అయితే, ఎలా అంటూ దవడను గట్టిగా నొక్కి చెప్పేశాడు.
Rohit Sharma try to kill Dinesh Karthik@ImRo45 @BCCI pic.twitter.com/06d6QpaPeH
— Jiaur Rahman (@JiaurRa91235985) September 20, 2022
తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య రెండో మ్యాచ్ నాగ్‌పూర్‌లో సెప్టెంబర్ 23న, మూడో మ్యాచ్ సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో జరగనుంది.