Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఎండు ద్రాక్షతో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా వాడితే ఆరోగ్యంతోపాటు మెరిసే చర్మం మీ సొంతం..

Benefits Of Black Raisins: యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఎండుద్రాక్షలు ముఖం ఛాయను మెరుగుపరచడం నుంచి ఆరోగ్యవంతంగా మార్చడం వరకు అన్ని పనులను చేస్తాయి.

Health Tips: ఎండు ద్రాక్షతో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా వాడితే ఆరోగ్యంతోపాటు మెరిసే చర్మం మీ సొంతం..
Benefits Of Black Raisins
Follow us
Venkata Chari

|

Updated on: Sep 20, 2022 | 9:22 AM

ఎండుద్రాక్షను పోషకాల గని పరిగణిస్తారు. ఈ కారణంగా ఇది ఆరోగ్యానికి వరం అని కూడా పేర్కొంటారు. ఎండుద్రాక్ష నీటితో చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఎండుద్రాక్ష నీటిని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, అలాగే దాని నుంచి ఎలాంటి చర్మ ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మ సంరక్షణ కోసం ఇంటి నివారణలను ప్రయత్నిస్తే, ఎండుద్రాక్ష నీటిని కూడా ఇందులో చేర్చుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఎండుద్రాక్షలు ముఖం ఛాయను మెరుగుపరచడం నుంచి ఆరోగ్యవంతంగా మార్చడం వరకు అన్ని పనులను చేస్తాయి. చర్మ సంరక్షణలో ఈ నీటిని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

ఎండుద్రాక్ష నీటిని ఎలా తయారు చేయాలి: ఎండుద్రాక్ష నీటిని తయారు చేయడానికి, రాత్రిపూట కొన్ని ఎండుద్రాక్షలను తీసుకొని నీటిలో నానబెట్టండి. ఈ నీటిలో పదార్థాలను మిక్స్ చేసి ఉదయం లేదా మరుసటి రోజు ముఖానికి పట్టించాలి. కావాలంటే ఈ నీటిని కూడా తాగొచ్చు. దీంతో పొట్ట ఆరోగ్యంతో బాటు చర్మం కూడా మెరుస్తుంది.

రైసిన్ వాటర్ స్క్రబ్: ఓట్స్, రైసిన్ వాటర్ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సిద్ధం చేసిన ఎండుద్రాక్ష నీటిలో ఓట్స్ పౌడర్ కలపండి. మీకు కావాలంటే దీనికి తేనెను కూడా జోడించవచ్చు. ఆ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి తర్వాత స్క్రబ్బింగ్ చేయాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు.

ఇవి కూడా చదవండి

రైసిన్ టోనర్: ఎండుద్రాక్ష నీటిని టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. రెండు రోజులు నానబెట్టిన ఎండుద్రాక్షను తీసివేసి, దాని నీటిలో రోజ్ వాటర్ కలపండి. దీన్ని స్ప్రే బాటిల్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. రాత్రి పడుకునే ముందు చర్మంపై స్ప్రే చేయండి.

ఎండుద్రాక్ష వాటర్ ప్రయోజనాలు: మీరు ఎండుద్రాక్ష నీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే, అది ముఖం ఛాయను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా చర్మంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయి. అలాగే మీ చర్మం హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. వృద్ధాప్య లక్షణాలు కూడా మీకు దూరంగా ఉండగలుగుతాయి.