Viral: తుపాకీతో దోపిడీకి భారీ స్కెచ్.. ఇంతలో ఊహించని ట్విస్ట్.. ప్యాంట్ జారుతున్నా పరుగు మాత్రం ఆపలా.. ఫన్నీ వీడియో..

ఈ ఫన్నీ వీడియో @TansuYegen అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 7.4 మిలియన్లు అంటే 74 లక్షల సార్లు వీక్షించగా, 5 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.

Viral: తుపాకీతో దోపిడీకి భారీ స్కెచ్.. ఇంతలో ఊహించని ట్విస్ట్.. ప్యాంట్ జారుతున్నా పరుగు మాత్రం ఆపలా.. ఫన్నీ వీడియో..
Funny Robbery Video
Follow us
Venkata Chari

|

Updated on: Sep 19, 2022 | 10:41 AM

Funny Robbery Video: ప్రస్తుతం దొంగతనాలు, దోపిడీ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు మనం చూస్తూనే ఉన్నాం. దొంగలు లేదా మోసగాళ్ళు దేనికీ భయపడకుండా.. రాత్రుళ్లు మాత్రమే కాదు.. పట్టపగలు కూడా దొంగతనానికి వెనుకాడడం లేదు. బహిరంగంగా నడిరోడ్డుపై జనాల నుంచి నగలు, డబ్బు లాక్కోవడం, ఆయుధాలతో దుకాణాలను దోచుకపోతున్నట్లు ఎన్నో వీడియోలు చూశాం. అయితే, ప్రస్తుతం కత్తులతో కాకుండా తుపాకులతో దొంగతనాలకు వెళ్తున్నారు. తాజాగా ఇటువంటి ఓ సంఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు.

ఈ వీడియోలో ఒక దొంగ తుపాకీతో ఓ ఆఫీసులోకి చొరబడ్డాడు. కానీ, ఆ తర్వాత జరిగిన సంఘటనతో ఈ వీడియో నెటిజన్లను బాగో ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తోంది. చేతిలో తుపాకీతో రిసెప్షన్ వద్ద నిలబడి ఉన్న అమ్మాయి వద్దకు వెళ్లాడు. తుపాకీతో బెదిరించి, డబ్బులు తీసుకోవాలని ప్లాన్ చేశాడు. కానీ, తను అనుకున్న ప్లాన్‌ని అమలుపరచడంలో మాత్రం విఫలమయ్యాడు. జేబులో తుపాకీని తీసే క్రమంలో అది జారి, అమ్మాయి వెనకాల పడుతుంది. దీంతో కంగారు పడిన దొంగ, తుపాకీని తీసుకునేందుకు విఫలయత్నం చేశాడు. ఇంతలో దొరికితే చావు దెబ్బలే గతి అనుకున్నాడేమో.. అక్కడి నుంచి పరార్ అయ్యాడు. తన ప్రాణాల కోసం పరిగెత్తుతూ.. తప్పించుకునే క్రమంలో అతని ప్యాంటు కూడా కిందకు జారిపోయినట్లు వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

దొంగ చేసిన హడావుడి చూడండి..

దోపిడీకి సంబంధించిన ఈ ఫన్నీ వీడియో @TansuYegen అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 7.4 మిలియన్లు అంటే 74 లక్షల సార్లు వీక్షించగా, 5 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి కామెంట్లు అందించారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?