Viral Video: భారీ ఊరేగింపుతో తరలి వచ్చిన 102 ఏళ్ల వృద్ధ పెళ్లి కుమారుడు.. ‘బతికే ఉన్నాను మహప్రభో..!’

అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిక్షేపంలాంటి వ్యక్తి చనిపోయాడని రికార్డుల్లో రాసుకున్నారు. 102 ఏళ్ల వయసులో పెన్షన్‌ కోసం వస్తే 'నువ్వు చచ్చిపోయి చాలా కాలం అయ్యిందంటూ' వాదించసాగారు. దీంతో ఆఫీసుల చుట్టు తిరగేక సదరు వ్యక్తి వినూత్నంగా..

Viral Video: భారీ ఊరేగింపుతో తరలి వచ్చిన 102 ఏళ్ల వృద్ధ పెళ్లి కుమారుడు.. 'బతికే ఉన్నాను మహప్రభో..!'
Old Groom
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 19, 2022 | 11:51 AM

102 year old groom did the bandwagon, the reason is special: అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిక్షేపంలాంటి వ్యక్తి చనిపోయాడని రికార్డుల్లో రాసుకున్నారు. 102 ఏళ్ల వయసులో పెన్షన్‌ కోసం వస్తే ‘నువ్వు చచ్చిపోయి చాలా కాలం అయ్యిందంటూ’ వాదించసాగారు. దీంతో ఆఫీసుల చుట్టు తిరగేక సదరు వ్యక్తి వినూత్నంగా తన ఉనికిని చాటాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మీరూ ఓ లుక్కేసుకోండి..

హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలోని గాంధ్రా గ్రామానికి చెందిన దూలీ చంద్ (102) అనే శతాధిక వ్యక్తికి ఇవ్వవలసిన వృద్ధాప్య పింఛన్‌ ఈ ఏడాది మార్చిలో ఆగిపోయింది. ఆరా తియ్యగా.. హర్యానా ప్రభుత్వం దూలీ చంద్‌కు వృద్ధాప్య పింఛను నిలిపివేసి.. అధికారిక రికార్డుల్లో చనిపోయినట్లు చూపారు. దీంతో తాతగారు మెడలో నోట్ల దండ ధరించి, బారీ ఊరేగింపుతో డీసీ ఆఫీసుకు చేరుకున్నాడు. తాను బతికే ఉన్నానని నిరూపించడానికే ఇదంతా చేస్తున్నాడని, తన ఆధార్ కార్డు, కుటుంబ గుర్తింపు కార్డు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను మీడియాకు చూపించాడు. ఈ ఊరేగింపులో దూలీ చంద్‌కు మద్ధతుగా కొందరు ప్లకార్డులు పట్టుకుని ‘మీ అంకుల్‌ ఇంకా బతికే ఉన్నాడు’ అని నినాదాలు కూడా చేయసాగారు. దీనిపై స్పందించిన హర్యానా యూనిట్ ఆప్ మాజీ నాయకుడు నవీన్ జైహింద్ దూలీ చంద్‌కు వెంటనే పింఛన్‌ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి వృద్ధులకు పింఛన్‌ నిలిపివేసి వేధింపులకు గురిచేయడం అన్యాయమన్నారు.

ఇవి కూడా చదవండి

నెల రోజుల క్రితం దూలీ చంద్‌ మనవడు ఈ విషయానికి సంబంధించి ఫిర్యాదు చేశాడు. ఐతే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో దులీ చంద్ మాజీ బీజేపీ మంత్రి మనీష్ గ్రోవర్‌ను కలిసి, తనకు పెన్షన్‌ అందేలా సహాయం చెయ్యమని వేడుకున్నాడు.