Congress: పార్టీ నుంచి వెళ్లిపోవాలంటే నా కారు ఇస్తా.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి ఇటీవల వలసలు పెరుగుతున్నాయి. హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి.. కమలం కండువా కప్పుకుంటున్నారు నాయకులు.. ఇటీవల గోవాలోని 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ..

Congress: కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి ఇటీవల వలసలు పెరుగుతున్నాయి. హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి.. కమలం కండువా కప్పుకుంటున్నారు నాయకులు.. ఇటీవల గోవాలోని 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వలసలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ సీఏం కమల్ నాథ్ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడకుండా నాయకులు ఎవరిని ఆపబోమని చెప్పారు. ఎవరైనా బీజేపీలో చేరాలనుకుంటే తన కారును అద్దెకిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోవాలో కాంగ్రెస్ కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన నాలుగు రోజుల తర్వాత కమల్ నాధ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు చాలా మంది బీజేపీలో చేరుతున్నారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు కమల్ నాధ్ సమాధానం ఇచ్చారు. ఎవరు ఏ పార్టీలో ఉండాలనేది వారి ఇష్టమని, బీజేపీలో చేరాలనుకునే వారు వెళ్లి ఆపార్టీలో చేరవచ్చన్నారు. మేం ఎవరినీ అడ్డుకునేది లేదన్నారు. ఎవరి రాజకీయ భవిష్యత్తును వారే ఆలోచించుకోవాలంటూ మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కమల్ నాధ్.
ప్రజలు కాంగ్రెస్ తో ఉన్నారని, ఎంతో మంది కార్యకర్తలు అంకితభావంతో పార్టీలో పనిచేస్తున్నారని కమల్ నాధ్ అన్నారు. బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. కేసుల పేరుతో తమ పార్టీ నాయకులను వేధిస్తోందని విమర్శించారు. నిజమైన కాంగ్రెస్ నాయకులపై ఎలాంటి ఒత్తిడిలు పనిచేయవని, డబ్బుతో వారిని కొనలేరంటూ కమల్ నాధ్ పేర్కొన్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..