- Telugu News Photo Gallery Death Spots: Most dangerous places in the world, Take a look at these pictures
Death Spots in the World: అక్కడికి వెళ్లడమంటే మృత్యువు నోట్లోకి ప్రవేశించడమే..! అత్యంత ప్రమాదకరమైన టూరిస్ట్ ప్రదేశాలివి..
ప్రపంచంలో అద్భుతమైన టూరిస్ట్ ప్రదేశాలున్నట్లే అత్యంత ప్రమాదకర స్పాట్స్ కూడా ఉన్నాయి. ఐతే ఇవి ప్రమాదకరమైన ప్రదేశాలని తెలిసినప్పటికీ టూరిస్టుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అవేంటో.. ఎక్కడున్నాయో తెలుసుకుందాం..
Updated on: Sep 19, 2022 | 12:49 PM

ప్రపంచంలో అద్భుతమైన టూరిస్ట్ ప్రదేశాలున్నట్లే అత్యంత ప్రమాదకర స్పాట్స్ కూడా ఉన్నాయి. ఐతే ఇవి ప్రమాదకరమైన ప్రదేశాలని తెలిసినప్పటికీ టూరిస్టుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అవేంటో.. ఎక్కడున్నాయో తెలుసుకుందాం..

అమెరికాలోని మౌంట్ వాషింగ్టన్ ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో చల్లని గాలులు వీస్తాయి. ఇక ఉష్ణోగ్రత -40 డిగ్రీల మేర ఉంటుంది. ఇంతచల్లని ప్రదేశంలో ఎవరైనా కాసేపు ఉంటే చాలు గడ్డకట్టి మృతిచెందుతారు. అందువల్ల మౌంట్ వాషింగ్‌టన్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా చెప్పుకుంటారు.

మరొక టూరిస్ట్ ప్లేస్ బాలి ఇండోనేషియాలో ఉంది. దీనిని ప్రమాదకరమైన లేదా డాష్ స్పాట్‌గా పరిగణిస్తారు. అదే సినాబంగ్ అనే అగ్నిపర్వతం. చివరిగా 2016లో ఈ అగ్నిపర్వతం పేలింది.

బ్రెజిల్‌లో స్నేక్ ఐలాండ్ అని పిలువబడే లా డా క్యూమాడా గ్రాండే సైట్ కూడా చాలా డేంజరస్ ప్లేస్. ఇక్కడ చాలా విషసర్పాలు ఉంటాయి. అక్కడకు వెళ్లడం అంటే మృత్యువు నోటిలోకి అడుగు పెట్టడమే. బ్రెజిల్ ప్రభుత్వం దీనిని టూరిస్టు ప్రదేశంగా ఉండటాన్ని నిషేధించింది.

రష్యాలో ఉన్న కమ్‌చట్కా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశంలో విషవాయువులు విడుదలవుతూ ఉంటాయి. దీని కారణంగా జంతువులు, మొక్కలు త్వరగా చనిపోతుంటాయి. ఎవరైనా ఈ ప్రదేశంలో అడుగుపెడితే జ్వరం, వాంతులు, వికారం మొదలవుతాయి.





























