Viral News: ఆ గ్రామంలో నమ్మకంతోనే అమ్మకం.. దుకాణదారులు లేని దుకాణాలు.. ఈ సంస్కృతిని ఏమంటారంటే

Viral News: హైవే పక్కన నిర్మించిన ఈ దుకాణాలలో కూరగాయలు, పండ్లు కాకుండా చేపలు కూడా విక్రయిస్తున్నారు. అయితే ఈ షాప్స్ లో ఒక్క ఈ దుకాణదారుడు లేడు. అదే విశేషం.

Sep 19, 2022 | 8:54 PM
Surya Kala

|

Sep 19, 2022 | 8:54 PM

 భారతదేశం ఒక ప్రత్యేకతను కలిగిన దేశం. భిన్న సంస్కృతులు, వేషభాషలు సముదాయం. ఒకప్పుడు వ్యాపారం వస్తు మార్పిడి ద్వారా జరిగేది. అయితే ఇప్పుడు డబ్బులు, డిజిటల్ ద్వారా క్రయవిక్రయాలు జరుపుతున్నారు. అయితే ఈరోజు మనదేశంలో కేవలం నమ్మకంతో మాత్రమే దుకాణాలు నడుస్తున్న రాష్ట్రం గురించి మీకు తెలుసా.. అక్కడ ఉన్న షాపుల్లో దుకాణదారులు ఎవరూ లేరు. ఈ షాపుల గురించి ఐఏఎస్ అవనీష్ శరణ్ ట్వీట్ చేశారు. ఈరోజు ఆ రాష్ట్రం, అక్కడ దుకాణాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

1 / 5
 భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి మిజోరం. ఇక్కడ హైవేపై కూరగాయలు, పండ్ల దుకాణాలు ఉన్నాయి. అయితే ఆ షాపుల్లో దుకాణదారుడు లేడు. షాప్స్ లో ఉన్న ఒక స్తంభంపై ధర వ్రాసిన చిన్న బోర్డు వేలాడదీసి ఉంటుంది. వస్తువులను తీసుకున్న కష్టమర్ డబ్బు ఇవ్వడానికి ఒక పెట్టె ఉంటుంది.

2 / 5
 సెలింగ్ గ్రామం మిజోరం రాజధాని ఐజ్వాల్ కి ఈశాన్య భాగంలో ఉంది. సుమారు 200 కి.మీ దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం. ఈ దుకాణాలు తరచుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ఇప్పటి వరకు ఈ షాపుల్లో ఒక్క దొంగతనం జరగలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

3 / 5
 మిజోరంలో ఈ సంస్కృతిని 'న్ఘహ్-లౌ-డావర్' అంటారు. ఈ దుకాణాలను కరోనా కాలంలో ప్రారంభించారు. హైవే పక్కన నిర్మించిన ఈ దుకాణాలలో కూరగాయలు, పండ్లు, చేపలు కాకుండా విక్రయిస్తున్నారు.

4 / 5
 ఎవరైతే సరుకులు కొనాల్సి వస్తే అంత డబ్బును షాపులో ఉంచిన బ్యాగులో వేస్తారు. దుకాణం నుంచి తమకు కావాల్సిన వస్తువులను తీసుకెళ్తారు. ఇలా చేయడానికి కారణం.. దుకాణదారులు షాపుల వద్ద కూర్చుని అమ్మడం ప్రారంభిస్తే వ్యవసాయం చేయడానికి సమయం ఉండదని ఇలాంటి దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు సెలింగ్ గ్రామస్థులు.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu