Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆ అద్భుత క్షణాలను కొడుకుతో పంచుకున్న సిక్సర్ల కింగ్.. ఇంతకీ రియాక్షన్ ఏమొచ్చిందంటే!

Yuvraj Singh: 15 సంవత్సరాల తర్వాత యువరాజ్ సింగ్ తన కొడుకు ఓరియన్‌తో కలిసి ఓ అద్భుతమైన క్షణాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియోని యూవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు కామెంట్లు చేస్తూ.. ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

Watch Video: ఆ అద్భుత క్షణాలను కొడుకుతో పంచుకున్న సిక్సర్ల కింగ్.. ఇంతకీ రియాక్షన్ ఏమొచ్చిందంటే!
Yuvraj Singh Celebrates 15 Years Of Historic ‘six Sixes In An Over’
Follow us
Venkata Chari

|

Updated on: Sep 19, 2022 | 1:14 PM

Yuvraj Singh: ఆల్‌రౌండ్ ప్రదర్శనకు పేరుగాంచిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సెప్టెంబర్ 19న భారత క్రికెట్‌కు మరపురాని రోజుగా నిలిపాడు. 15 ఏళ్ల క్రితం ఇదే రోజున యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టి చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. అదికూడా స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో కావడం గమనార్హం. 15 సంవత్సరాల తర్వాత, యువరాజ్ సింగ్ తన కొడుకు ఓరియన్‌తో రియన్‌తో కలిసి ఓ అద్భుతమైన క్షణాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియోని యూవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు కామెంట్లు చేస్తూ.. ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ టీవీలో తన చారిత్రాత్మక ఆరు సిక్స్‌ల ఇన్నింగ్స్‌లను చూస్తున్నాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఆరు బంతుల్లో యువరాజ్ ఆరు సిక్సర్లు కొట్టడం, అంతకు ముందు ఫ్లింటాఫ్‌తో జరిగిన గొడవ వినిపించాడు. ఈ వాదన తర్వాత యువరాజ్ కోపంగా ఉన్నాడు. బ్రాడ్‌ను టార్గెట్ చేసుకుని, ఆ ఓవర్లో తన కోపాన్ని వెళ్లగక్కాడు.

యువరాజ్ సింగ్ తన కొడుకు ఓరియన్ కీచ్ సింగ్‌తో కలిసి తన ఇన్నింగ్స్‌ను వీక్షిస్తున్న వీడియో..

ఇవి కూడా చదవండి

“15 సంవత్సరాల తర్వాత కలిసి ఈ క్షణాలను చూడటానికి ఇంతకంటే మంచి భాగస్వామి దొరకలేదు” అని యువరాజ్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్‌లో పేర్కొన్నాడు.

భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఆ వీడియోపై స్పందించాడు. “చిన్నవాడు నీ టెక్నిక్‌ని గమనిస్తున్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

19వ ఓవర్ తొలి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా యువరాజ్ కొట్టాడు. తర్వాతి ఓవర్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్, మూడవది వైడ్ లాంగ్-ఆఫ్ మీదుగా, ఆపై డీప్ పాయింట్ మీదుగా ఫుల్ టాస్‌కి, ఐదవది స్క్వేర్ లెగ్ మీదుగా హాక్, చివరకు వైడ్ లాంగ్-ఆన్‌పై భారీ హిట్. ఇలా యూవీ కేవలం 12 బంతుల్లోనే T20Iలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇది ఇంకా బ్రేక్ చేయని రికార్డుగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో భారత్ 218 పరుగులు చేసి 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. యువరాజ్ సింగ్ కొట్టిన ఆఖరి షాట్ ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలవడానికి సహాయపడింది.