AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాయ్‌ఫ్రెండ్ కోసం.. పొట్టుపొట్టు కొట్టుకున్న ఇద్దరమ్మాయిలు.. అంతటితో ఆగకుండా..

చిన్న చిన్న విషయాలకే గొడవ పడడం, కొట్టుకోవడం ఇప్పటి వరకు చూసి ఉంటాం. అయితే, ఆడవాళ్లు భర్తల కోసం లేదా అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్ కోసం పోరాడడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Viral Video: బాయ్‌ఫ్రెండ్ కోసం.. పొట్టుపొట్టు కొట్టుకున్న ఇద్దరమ్మాయిలు.. అంతటితో ఆగకుండా..
Two Girls Fight On The Road
Venkata Chari
|

Updated on: Sep 18, 2022 | 7:48 PM

Share

Trending Video: నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. నెటిజన్లకు ఇవి నచ్చడంతో తెగ వైరల్ చేస్తుంటారు. అయితే, వీటిలో కొన్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని షాక్ ఇస్తుంటాయి. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే మాత్రం నిజంగా తిట్టుకుంటాం. చిన్న చిన్న విషయాలకే గొడవ పడడం, కొట్టుకోవడం ఇప్పటి వరకు చూసి ఉంటాం. అయితే, ఆడవాళ్లు భర్తల కోసం లేదా అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్ కోసం పోరాడడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతున్నట్లు చూడొచ్చు. ఈ గొడవకు కారణం కూడా చాలా విచిత్రంగా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

బాయ్‌ఫ్రెండ్ కోసం అమ్మాయిలిద్దరూ గొడవపడుతుంటారు. ఇదీ స్థానిక ప్రజలు చెబుతున్న మాట. ఈ ఉదంతం బీహార్‌లోని ఛప్రా జిల్లాలో జరుగుతోంది. ఇద్దరు అమ్మాయిలు ఒకరిపై ఒకరు ఎలా పోట్లాడుకుంటున్నారో, ఒకరిపై ఒకరు చెప్పుల వర్షం కురిపించుకుంటున్నారో వీడియోలో చూడొచ్చు. ఇది కాకుండా, ఇద్దరూ ఒకరి జుట్టును మరొకరు దారుణంగా లాగుతున్నారు. ఈ సమయంలో ఒక అబ్బాయి వారి గొడవను విడగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, వారి దూకుడు చూసి, ఆయన వెనక్కి తగ్గాడు. అయితే, రోడ్డుపై కొంతసేపు గొడవపడిన తర్వాత వారి కోసం చల్లారడంతో ప్రశాంతంగా మారారు. ఆ తర్వాత వాళ్ల దారిలో వాళ్లు వెళ్లడం చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

అమ్మాయిలు ఎలా కొట్టుకుంటున్నారో చూడండి..

ఈ సంఘటన గురించి ఈ సమాచారం ఇంకా అందలేదు. అసలు ఎవరి బాయ్‌ఫ్రెండ్ కోసం వీరు గొడవ పడ్డారో మాత్రం తెలియదు. అయితే, ఇలాంటి కేసు ఇదే మొదటిది కాదు. రెండు నెలల క్రితమే జార్ఖండ్‌లో ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాయ్‌ఫ్రెండ్ వ్యవహారంలో ఇద్దరు అమ్మాయిలు తీవ్రంగా గొడవపడ్డారు. ఆ తర్వాత ఆ అమ్మాయిలు యుద్ధానికి కాలు దువ్వారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి వారి గొడవను సద్దుమణిగించాల్సి వచ్చింది.