Team India: మహ్మద్ షమీ తర్వాత మరో భారత బౌలర్ ఔట్.. కారణం ఏంటంటే?

IND vs AUS: ఆస్ట్రేలియాతో జరిగే 3-మ్యాచ్‌ల T20 సిరీస్‌ నుంచి మహ్మద్ షమీ నిష్క్రమించి 24 గంటలు కూడా కాలేదు. అంతలోనే ఇండియా A జట్టు నుంచి ఒక ఫాస్ట్ బౌలర్ ఔట్ అయ్యాడు.

Team India: మహ్మద్ షమీ తర్వాత మరో భారత బౌలర్ ఔట్.. కారణం ఏంటంటే?
Ind Vs Nz Navdeep Saini
Follow us
Venkata Chari

|

Updated on: Sep 18, 2022 | 2:35 PM

India A Team: భారత బౌలర్లకు అంతగా లక్ కలసి రావడం లేదు. ప్రస్తుతం పరిస్థితులుకు వారికి అనుకూలంగా లేనట్లు తెలుస్తోంది. అందుకే ఒకరి తర్వాత మరొకరు బౌలర్లు జట్టును వీడుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగే 3-మ్యాచ్‌ల T20 సిరీస్‌కు మహ్మద్ షమీ నిష్క్రమించి 24 గంటలు కూడా కాకముందే, ఇండియా A జట్టు నుంచి ఒక ఫాస్ట్ బౌలర్ ఔట్ అయ్యాడనే వార్తలు కూడా వచ్చాయి. భారత్ ఎ జట్టు నుంచి తప్పుకున్న బౌలర్ పేరు నవదీప్ సైనీ.

గజ్జల్లో గాయంతో ఇబ్బందులు..

బీసీసీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం నవదీప్ సైనీకి గజ్జల్లో గాయం తేలింది. దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్, నార్త్ జోన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. దీని తర్వాత, అతను దులీప్ ట్రోఫీ నుంచి, న్యూజిలాండ్‌తో జరిగిన ఇండియా A సిరీస్ నుంచి కూడా నిష్క్రమించాడు.

సైనీ పునరావాసం కోసం NCA బాట..

గజ్జల్లో గాయం నుంచి కోలుకోవడానికి సైనీ ఇప్పుడు ఎన్‌సీఏకు వెళ్లనున్నాడని, అక్కడ అతను పునరావాసం చేస్తాడని బీసీసీఐ తెలిపింది. ఇది కాకుండా, నవదీప్ సైనీకి బదులుగా రిషి ధావన్‌ను ఇండియా ఎ జట్టులోకి తీసుకోవడం గురించి కూడా బోర్డు సమాచారం ఇచ్చింది.

ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో షమీ స్థానంలో ఉమేష్‌..

నవదీప్ సైనీ గాయం కారణంగా వైదొలగడానికి ముందు, భారత సీనియర్ జట్టు నుంచి ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నిష్క్రమించాడు. షమీకి కరోనా సోకడంతో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతని స్థానంలో ఉమేష్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ధృవీకరించింది.

సెప్టెంబర్ 20 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ మొహాలీలో జరగనుంది. రెండో మ్యాచ్ నాగ్‌పూర్‌లో సెప్టెంబర్ 23న, మూడో, చివరి మ్యాచ్ సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో జరగనుంది.