- Telugu News Photo Gallery Cricket photos Ind vs aus virat kohli only player to score 500 plus runs against australia in t20i records
IND vs AUS: ఆస్ట్రేలియాపై ఈ ప్లేయర్ అన్‌స్టాపబుల్ ఇన్నింగ్స్.. రికార్డులు చూస్తే వారికి వణుకే..
సెప్టెంబర్ 20 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది.
Updated on: Sep 17, 2022 | 5:45 PM

సెప్టెంబర్ 20 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఆస్ట్రేలియాను అన్ని రకాలుగా భయపెట్టేందుకు విరాట్ కోహ్లీ సిద్ధమయ్యాడు. ఈ రికార్డులు చూస్తే, కచ్చితంగా ఆసీస్ ఈ ఆటగాడిపై ఓ కన్నేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 500కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియాపై మొత్తం 718 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 క్రికెట్‌లో కోహ్లీ 18 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో అతను మొత్తం 7 అర్ధ సెంచరీలు చేశాడు. ఈ సమయంలో 90 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20ల్లో కోహ్లీ సగటు 59.83 కాగా, అతని స్ట్రైక్ రేట్ 146.23గా నిలిచింది.

2020 డిసెంబర్ 8న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌ను కోహ్లీ ఆడాడు. ఆ మ్యాచ్‌లోఈ భారత స్టార్ 85 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.





























