AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Aus, 1st T20I: నేటినుంచే ఆసీస్‌తో టీ20 సిరీస్.. టీమిండియా ప్లేయింగ్ IXలో కీలక మార్పులు..

IND Vs AUS T20I Match Preview: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండింటికీ, ఈ సిరీస్ ప్రపంచ కప్ కోసం సన్నాహకతను పరీక్షించడానికి ఒక అవకాశంగా మారింది.

Ind vs Aus, 1st T20I: నేటినుంచే ఆసీస్‌తో టీ20 సిరీస్.. టీమిండియా ప్లేయింగ్ IXలో కీలక మార్పులు..
Ind Vs Aus, 1st T20i
Venkata Chari
|

Updated on: Sep 20, 2022 | 7:12 AM

Share

IND Vs AUS T20I Predicted Playing XI: ఆసియా కప్-2022లో భారత క్రికెట్ జట్టు నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు టైటిల్ కోసం బలమైన పోటీదారుగా UAE చేరుకుంది. కానీ, సూపర్-4 నుంచి తిరిగి వచ్చింది. ఈ ఓటమి టీమ్ మేనేజ్‌మెంట్ ముందు అనేక ప్రశ్నలను మిగిల్చింది. ఈ ప్రశ్నలకు సమాధానం మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమవుతుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విజయాల బాట పట్టాలని కోరుకుంటుంది.

వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌2022కు సన్నాహాలను పరీక్షించుకునేందుకు భారత్‌కు ఈ సిరీస్‌ చక్కటి అవకాశం. ప్రపంచకప్‌కు ముందు టీమిండియా ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌తో సరైన కలయికకు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.

భారత్ బౌలింగ్ బలంగా ఉంది..

ఇవి కూడా చదవండి

ప్రపంచకప్‌నకు ముందు జరిగే ఆరు మ్యాచ్‌ల్లో కొంత మంది ఫాస్ట్ బౌలర్లకు విశ్రాంతినిచ్చినా.. ఇది మినహా భారత్ తన బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా తర్వాత భారత్ మూడు మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికాతో ఆతిథ్యం ఇవ్వనుంది. T20 ఫార్మాట్‌లో ఆవశ్యతను కొనసాగించడం చాలా ముఖ్యం. కానీ, ఆస్ట్రేలియాలో జరిగే ICC ఈవెంట్‌కు ముందు తన ఆటగాళ్లు అన్ని ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి ప్రయత్నిస్తారని కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆసియా కప్‌లో భారత్ బ్యాటింగ్ బాగానే ఆడినప్పటికీ, ఈ సమయంలో చాలా మార్పులు చేసింది. ఈ టోర్నీలో భారత బౌలింగ్ బలహీనతలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అయితే హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడంతో దాడికి బలం చేకూరింది.

ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ తనతో కలిసి ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తాడని, అయితే అతనితో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని రోహిత్ స్పష్టం చేశాడు. తన చివరి టీ20 ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగవచ్చు. కానీ, అలాంటివి కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే కనిపిస్తాయని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ప్లేయింగ్ 11లో పంత్ లేదా కార్తీక్..

భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో టాప్‌ ఫోర్‌ బ్యాట్స్‌మెన్‌ ఫిక్స్‌ అయితే ప్లేయింగ్‌ ఎలెవన్‌లో వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ని ఎంపిక చేస్తారా లేక దినేష్‌ కార్తీక్‌ను ఎంపిక చేస్తారా అన్నది ఇంకా నిర్ణయించలేదు. రవీంద్ర జడేజా గాయం కారణంగా పంత్‌ను లెఫ్ట్‌ హ్యాండ్‌గా ఎంపిక చేయనున్నారు. కారణం కార్తీక్‌కు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఫినిషర్ పాత్ర కోసం కార్తీక్ ఎంపికయ్యారు. అతనికి ఆసియా కప్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ, జట్టు మేనేజ్‌మెంట్ అతనికి రాబోయే రెండు వారాల్లో కొంత సమయం క్రీజులో ఉండే అవకాశం ఇవ్వవచ్చు. దీపక్ హుడా ఆసియా కప్‌లో అన్ని సూపర్ ఫోర్ మ్యాచ్‌లలో ఆడాడు. కానీ, జట్టులో అతని పాత్రపై స్పష్టత లేదు.

బౌలింగ్ జోడీపై తర్జనభర్జనలు..

ఆసియా కప్‌లో జడేజా గాయపడటంతో జట్టులో బౌలింగ్ బ్యాలెన్స్ చెదిరిపోయింది. భారత్ ఐదుగురు బౌలర్లతో ఆడవలసి వచ్చింది. బౌలింగ్‌లో ఆరో ఎంపిక లేదు. హార్దిక్ పాండ్యా, జడేజాల స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంచినట్లయితే, భారత్‌కు అదనపు బౌలింగ్ ఎంపిక ఉంటుంది. బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్, హార్దిక్‌ల ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు అక్షర్, యుజువేంద్ర చాహల్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉండవచ్చు. ఆస్ట్రేలియా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీమ్ మేనేజ్‌మెంట్ ఈ మ్యాచ్‌లకు టీమ్ కాంబినేషన్‌ను సిద్ధం చేస్తుంది.

ఫించ్, డేవిడ్‌పై దృష్టి..

మరోవైపు డేవిడ్ వార్నర్‌తో సహా కొందరు కీలక ఆటగాళ్లు లేకుండానే ఆస్ట్రేలియా భారత్‌కు వచ్చింది. వార్నర్‌కు విశ్రాంతి ఇవ్వగా, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్ గాయాల నుంచి కోలుకోవడానికి సమయం ఇచ్చారు. తన స్థిరమైన పేలవ ప్రదర్శన కారణంగా ఇటీవలే వన్డేల నుంచి రిటైర్ అయిన కెప్టెన్ ఆరోన్ ఫించ్‌పై అందరి దృష్టి ఉంటుంది. ప్రపంచకప్‌నకు ముందు అతను మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. సింగపూర్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తర్వాత ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయనున్న మరో ఆటగాడు టిమ్ డేవిడ్‌పై కూడా అందరి దృష్టి ఉంది.

ఇరు జట్లు..

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ఆడమ్ జాంపే

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్.

భారత ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ – రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ , సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా మరియు యుజ్వేంద్ర చాహల్