Viral Video: దిమ్మతిరిగే పంచ్‌లు.. మతిపోగొట్టే కిక్‌లు.. కంగారుల మధ్య ఫైట్ చూస్తే నవ్వాపుకోలేరు.. వైరల్ వీడియో

కంగారూల పోరాట వీడియో @gunsnrosesgirl3 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 8 లక్షల 57 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Viral Video: దిమ్మతిరిగే పంచ్‌లు.. మతిపోగొట్టే కిక్‌లు.. కంగారుల మధ్య ఫైట్ చూస్తే నవ్వాపుకోలేరు.. వైరల్ వీడియో
Kangaroos Fight Video
Follow us
Venkata Chari

|

Updated on: Sep 20, 2022 | 9:53 AM

కంగారూలను టీవీ లేదా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటుంటాం. ఎందుకంటే ఇవి ఆస్ట్రేలియాలో కనిపించే జంతువులు. ఇవి శాకాహారులు, ప్రశాంతమైన స్వభావం గల జంతువులుగా పేరగాంచాయి. అయితే, కొన్నిసార్లు ఇవి కూడా దూకుడుగా మారతాయి. ఇలాంటి పరిస్థితి మధ్యే జరిగిన ఓ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. రెండు కంగారుల మధ్య జరిగిన ఫైట్ చాలా ఫన్నీగా ఉంది. మనుషుల్లాగే పోరాడుతూ కనిపించాయి. మనుషులు నిలబడి, తన్నుకోవడం, పంచ్‌లతో పోరాడినట్లుగానే, కంగారూలు కూడా ఒక దానితో ఒకటి పోట్లాడడం చూడొచ్చు.

విశేషమేమిటంటే ఈ పోరును పక్కనే ఉన్న మిగతా కంగారూలు చూస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ కంగారూల పోరు మొదట చేతులతో మొదలై ఆ తర్వాత కాళ్లతో కిక్‌లు ఇచ్చుకునే వరకు చేరాయి. పైకి దూకుతూ, ఒకదానిపై ఒకటి దాడి చేస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. వెనక్కి తగ్గేదేలే అంటూ ఒకదానిపై ఒకటి పోట్లాడుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కంగారూల భీకర పోరు వీడియో..

కంగారూల పోరాట వీడియో @gunsnrosesgirl3 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 8 లక్షల 57 వేలకు పైగా వీక్షించగా, వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు.