Boy Complaint: తల్లి కిరాతకం.. అమ్మ కొడుతోంది.. అన్నం కూడా పెట్టడంలేదు.. తల్లిపై పోలీసులకు చిన్నారి కంప్లైంట్..

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Sep 20, 2022 | 9:53 AM

సాధారణంగా చిన్న పిల్లలు పోలీసులంటే భయపడుతుంటారు. వారు కనిపిస్తే చాలు ఆమడ దూరం పరిగెడతారు. కానీ ఓ చిన్నారి మాత్రం తన తల్లి పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.


సాధారణంగా చిన్న పిల్లలు పోలీసులంటే భయపడుతుంటారు. వారు కనిపిస్తే చాలు ఆమడ దూరం పరిగెడతారు. కానీ ఓ చిన్నారి మాత్రం తన తల్లి పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తల్లిపై కంప్లైంట్ చేసి, చర్యలు తీసుకోవాలని ఏడుస్తూ చెప్పాడు. బాలుడి చెప్పింది విని విస్తుపోయిన పోలీసులు అతనికి, తల్లికి నచ్చజెప్పారు. ఈ విచిత్ర సంఘటన బీహార్లో చోటుచేసుకుంది.బీహార్‌లోని సీతామడి పోలీస్ స్టేషన్ కు ఎనిమిదేళ్ల బాలుడు ఏడుస్తూ వెళ్లాడు. అక్కడ ఉన్న పోలీసులకు తన తల్లిపై ఫిర్యాదు చేశాడు. తనకు అన్నం పెట్టట్లేదని, దారుణంగా కొడుతోందని కన్నీటిపర్యంతమయ్యాడు. ఒక్కోసారి తాను తింటుంటే ప్లేట్ లాక్కుంటుతందని చెప్పాడు. చిన్నారి ఇచ్చిన కంప్లైంట్ కు అక్కడి పోలీసులు షాక్ అయ్యారు. ఏడుస్తున్న బాలుడ్ని ఓదార్చి అన్నం పెట్టారు. తృప్తిగా తిన్నాక వివరాలు సేకరించారు. తాను నాలుగో తరగతి చదువుతున్నానని, నాన్న మరో చోట ఉంటాడని తాను తల్లి తో కలిసి ఉంటానని చెప్పాడు. బాలుడు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు బాలుడి ఇంటికి వెళ్లారు. చిన్నారి తల్లితో మాట్లాడగా తాను అలాంటిదేమీ చేయడం లేదని, అల్లరి చేస్తుంటాడని అలాంటి పరిస్థితుల్లో కోపం పట్టలేక తిడుతుంటానని ఆమె చెప్పారు. చిన్నారిని మంచిగా చూసుకోవాలని, సమయానికి భోజనం పెట్టి స్కూల్ కు పంపించాలని తల్లిని మందలించారు. బాలుడు కంప్లైంట్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu