Team India: టీ20 ప్రపంచకప్ 2024కి ప్రిపరేషన్ షురూ.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..
India vs Afghanistan: జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ ద్వారా టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్లీ టీ20 క్రికెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు 2022 తర్వాత భారత్ తరపున ఎలాంటి టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. అయితే, బీసీసీఐ నేడు లేదా రేపు టీమిండియా జట్టును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
India vs Afghanistan: భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ముగిసింది. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 1-1తో సమం చేయడంలో టీం ఇండియా(Team India) విజయం సాధించింది. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టు సన్నద్ధం కావాలి. టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత్‌కు ఇదే చివరి టీ20 సిరీస్.
అంటే, ఈ సిరీస్ తర్వాత టీమ్ ఇండియా టీ20 మ్యాచ్‌లు ఆడడం లేదు. తద్వారా టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఈ సిరీస్ ద్వారా పటిష్టమైన జట్టును రూపొందించాలని టీమ్ ఇండియా భావిస్తోంది.
దిగ్గజాల పునరాగమనం..
📢 Announced!
Take a look at #TeamIndia‘s group stage fixtures for the upcoming ICC Men’s T20 World Cup 2024 👌👌
India will play all their group matches in the USA 🇺🇸#T20WorldCup pic.twitter.com/zv1xrqr0VZ
— BCCI (@BCCI) January 5, 2024
జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ ద్వారా టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్లీ టీ20 క్రికెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు 2022 తర్వాత భారత్ తరపున ఎలాంటి టీ20 మ్యాచ్‌లు ఆడలేదు.
ఇప్పుడు టీ20 ప్రపంచకప్ కోసం పొట్టి క్రికెట్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు మళ్లీ కనిపించే అవకాశం ఉంది. దీని ప్రకారం అఫ్గానిస్థాన్‌తో జరిగే సిరీస్‌లో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది.
అలాగే, గత ఏడాది కాలంగా టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో గాయపడిన సూర్యకుమార్ యాదవ్.. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌కు అందుబాటులో లేడు.
భారత్-ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ షెడ్యూల్:
జనవరి 11: మొదటి T20I (మొహాలీ)
జనవరి 14: రెండవ T20I (ఇండోర్)
జనవరి 17: మూడవ T20I (బెంగళూరు)
భారత్ ప్రాబబుల్ టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రింకూ సింగ్, కేఎల్ రాహుల్, జితేశ్ శర్మ, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..