WTC 2025: ఒకే దెబ్బకు భారత్, పాకిస్తాన్ జట్లకు భారీ షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా.. అదేంటంటే?
World Test Championship: పాకిస్థాన్‌పై సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా టెస్టు జట్టు ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో నిలిచింది. 117 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాను ఆసీస్ జట్టు వెనక్కి నెట్టి తొలి స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు మొత్తం 118 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, భారత జట్టు రెండో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్ 3వ స్థానంలో, దక్షిణాఫ్రికా 4వ స్థానంలో, న్యూజిలాండ్ 5వ స్థానంలో ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోయిన పాకిస్థాన్ జట్టు 6వ స్థానానికి పడిపోయింది.

WTC 2025 Rankings: పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా (Australia) క్లీన్ స్వీప్ చేసింది . మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక చివరిదైన 3వ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకుని, అటు పాకిస్తాన్‌కు, ఇటు టీమిండియాకు భారీ షాక్ ఇచ్చింది.
ఈ చారిత్రాత్మక విజయం తర్వాత, ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో కూడా అగ్రస్థానంలో నిలిచింది. అంతకు ముందు భారత జట్టు మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు 56.25% విజయ శాతంతో మొదటి స్థానంలో నిలిచింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు మొత్తం 8 మ్యాచ్‌లు ఆడింది. ఈ సందర్భంలో, 5 మ్యాచ్‌లు గెలవగా, 1 మ్యాచ్ డ్రా అయింది. కేవలం 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 54 పాయింట్లు సాధించి ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
డబ్ల్యూటీసీ టెస్టు సిరీస్‌లో మొత్తం 4 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 2 మ్యాచ్‌లు గెలిచింది. మరో మ్యాచ్ డ్రాగా ముగియగా, ఒక మ్యాచ్ ఓడిపోయింది. దీంతో భారత జట్టు 26 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో గెలిచిన దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 12 పాయింట్లు సాధించింది.
టీమ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1..
No.1 Test side ⏩ No.1 in the #WTC25 Standings!
Australia continue to dominate 💪
More ⬇️
— ICC (@ICC) January 6, 2024
పాకిస్థాన్‌పై సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా టెస్టు జట్టు ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో నిలిచింది. 117 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాను ఆసీస్ జట్టు వెనక్కి నెట్టి తొలి స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు మొత్తం 118 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, భారత జట్టు రెండో స్థానానికి పడిపోయింది.
ఇంగ్లండ్ 3వ స్థానంలో, దక్షిణాఫ్రికా 4వ స్థానంలో, న్యూజిలాండ్ 5వ స్థానంలో ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోయిన పాకిస్థాన్ జట్టు 6వ స్థానానికి పడిపోయింది.
ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మూడవ ఎడిషన్ (2023-25) డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య యాషెస్ 2023తో ప్రారంభమైంది. గత రెండు ఎడిషన్ల మాదిరిగానే, ఈసారి కూడా 9 జట్లు టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. చివరికి టాప్ 2 జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి.
ICC WTC 2023-25 పాయింట్ల పట్టిక..
WTC 2023-25లో మొత్తం 27 సిరీస్‌లు, 68 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రతి జట్టు స్వదేశంలో, విదేశాల్లో 3-3 సిరీస్‌లు ఆడాలి. కాగా ఫైనల్ 2025లో లార్డ్స్‌లో జరుగుతుంది. అంతకుముందు 2021లో, ఫైనల్‌ను సౌతాంప్టన్‌లో, 2023లో ది ఓవల్‌లో ఆడారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..