ODI World Cup 2023: ఆతిథ్య దేశంగా భారత్.. ఓపెనింగ్ మ్యాచ్ ఎందుకు ఆడడం లేదు.. అసలు కారణం ఇదే?
ODI World Cup 2023: ప్రపంచ కప్ 2023 ప్రారంభ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. అక్టోబరు 8 ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆతిథ్య దేశమైనప్పటికీ 2023 ప్రపంచకప్‌లో భారత్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడడం లేదు.

వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, అభిమానుల మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీమ్ ఇండియా ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్నప్పటికీ టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ ఎందుకు ఆడడం లేదు? సాధారణంగా మేజర్ టోర్నీల్లో ఆతిథ్య దేశం ఓపెనింగ్ మ్యాచ్ ఆడడం ఆనవాయితీ. కానీ, భారత్‌లో జరగనున్న ప్రపంచకప్ షెడ్యూల్ (World Cup 2023 Schedule)లో ఇరు దేశాల మధ్య తొలి మ్యాచ్‌లో భారత్ పేరు లేదు. ఇలా ఎందుకు జరిగిందనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ICC షెడ్యూల్ ప్రకారం, క్రికెట్ వన్డే సంగ్రామం 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరుగుతుంది.
ప్రపంచ కప్ 2023 ప్రారంభ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. అక్టోబరు 8 ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆతిథ్య దేశమైనప్పటికీ 2023 ప్రపంచకప్‌లో భారత్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడడం లేదు.
హోస్ట్ ఆడాలనే నియమం లేదు..
ప్రపంచకప్ చరిత్రను పరిశీలిస్తే.. ఓపెనింగ్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆడాలనే నిబంధన ఏమీ లేదు. కాబట్టి ఈ ఏడాది కూడా ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే దేశం తొలి మ్యాచ్ ఆడడం లేదు. ప్రపంచ కప్‌లో చాలాసార్లు, డిఫెండింగ్ ఛాంపియన్‌లను ఓపెనింగ్ మ్యాచ్ ఆడకుండా ఆతిథ్య దేశం అనుమతించింది. 1992 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ టైటిల్ గెలుచుకుంది. కానీ 1996లో పాకిస్థాన్ జట్టు ప్రారంభ మ్యాచ్ ఆడలేదు. అంతేకాకుండా, 2015 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత 2019 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఓపెనింగ్ మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు.




ఛాంపియన్స్-రన్నర్స్ అప్ జట్టు మధ్య మొదటి మ్యాచ్..
వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడడం ఇది మూడోసారి. ఇంతకుముందు ఈ రెండు జట్లు 1983, 1996 ప్రపంచకప్‌లలో ప్రారంభ మ్యాచ్‌లలో తలపడ్డాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్, గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ ఈ ఏడాది ఓపెనింగ్ మ్యాచ్ ఆడనున్నాయి.
ఆదివారం భారత్ ఐదు మ్యాచ్‌లు..
ఈ ప్రపంచకప్‌లో ఆదివారం టీమిండియా ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆదివారం పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో భారత్ ఆడనుంది. బుధవారం ఆఫ్ఘనిస్థాన్‌తో, గురువారం బంగ్లాదేశ్‌తో పాటు ఇతర క్వాలిఫైయింగ్ జట్లతో మ్యాచ్‌లు జరగనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
