- Telugu News Photo Gallery Cricket photos ‘Difficult to understand Rahane..’, Sourav Ganguly on elevating the player as Vice Captain immediately after a test Match
IND vs WI Test Series: బీసీసీఐ నిర్ణయంపై భారత మాజీ కెప్టెన్ ప్రశ్నలు.. అందుకు గిల్, జడేజా సరైనవారంటూ..
Sourav Ganguly: భారత్ క్రికెట్ జట్టు జూలై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా ఆడాల్సిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఎంచుకున్న జట్టు నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ప్రశ్నలు లేవనెత్తాడు.
Updated on: Jun 29, 2023 | 3:05 PM

IND vs Wi Test Series: వెస్టిండీస్ పర్యటన కోసం భారత టెస్టు జట్టును ప్రకటించగానే చాలా మంది క్రికెటర్లు, అభిమానులు షాక్ అయ్యారు. ఆశ్చర్యపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అయితే అందరికంటే ఆశ్చర్యకరమైనది వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానేని ఎంపిక చేయడం. ఇదే విషయంలో బీసీసీఐపై సౌరవ్ గంగూలీ కూడా ప్రశ్నలు సంధించాడు.

అజింక్యా రహానెను టెస్ట్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం తనను ఆశ్చర్యపరిచిందని, ఈ నిర్ణయం వెనుక బీసీసీఐకి ఉన్న ఆలోచన ఏమిటో అర్థం కాలేదని పేర్కొన్నాడు. అలాగే శుభమాన్ గిల్ వంటి యువ ఆటగాడిని భారత్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ఇంకా వైస్ కెప్టెన్ బాధ్యతల కోసం శుభమాన్‌ని సిద్ధం చేసి ఉంటే బాగుండేదని, అదే సరైన నిర్ణయం అని తాను భావిస్తున్నట్లు దాదా చెప్పుకొచ్చాడు. ఇంకా రహానే విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఉన్న కారణం తనకు అర్థం కావడంలేదని తెలిపాడు.

దాదా ప్రకారం.. గిల్‌ని వైస్ కెప్టెన్ చేయకపోతే, రవీంద్ర జడేజాకు ఈ బాధ్యతను అప్పగించవచ్చు. జడేజాకు చాలా అనుభవం ఉంది, పైగా అందుకు అర్హుడు.

కాగా, అజింక్య రహానే 18 నెలల పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించిన అతను ప్రపంచ టెస్ట చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఎంపికయ్యాడు. అందులో కూడా రహానే రాణించడంతో అతనికి వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించింది బీసీసీఐ.





























