- Telugu News Photo Gallery Cricket photos India vs west indies 4 Indian players not selected for wi tour for violated the team code of conduct during IPL 2023 says reports
Team India: రూల్స్ అతిక్రమించిన నలుగురు భారత ఆటగాళ్లు.. కట్‌చేస్తే.. వెస్టిండీస్ టూర్ నుంచి తప్పించిన బీసీసీఐ..
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సందర్భంగా, 4 ఫ్రాంచైజీలకు చెందిన నలుగురు భారతీయ ఆటగాళ్ళు నిబంధనలు ఉల్లంఘించారంట. నివేదికల ప్రకారం, ఈ ఆటగాళ్ళు హోటల్ నుంచి తరుచుగా బయటకు వెళ్లేవారంట.
Updated on: Jun 30, 2023 | 9:34 AM

భారత్‌కు చెందిన నలుగురు యువ ఆటగాళ్లకు బీసీసీఐ శిక్ష విధించనుంది. ఐపీఎల్ 2023 సందర్భంగా ఈ నలుగురు ఆటగాళ్లు జట్టు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనేది పెద్ద వార్త. ఈ ఆటగాళ్లు అనుమతి లేకుండా జట్టు హోటల్ నుంచి అదృశ్యమయ్యారు. దీంతో వారిపై ఐపీఎల్ టీమ్ బీసీసీఐకి ఫిర్యాదు చేసింది.

ఈ నలుగురు ఆటగాళ్లు ఐపీఎల్ నార్త్ ఇండియా ఫ్రాంచైజీకి చెందిన ఆటగాళ్లు అని కూడా నివేదికల్లో వెల్లడైంది. ఈ నలుగురు ఆటగాళ్లు లక్నో సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లేదా రాజస్థాన్ రాయల్స్‌కు చెందినవారని తెలుస్తోంది.

ఐపీఎల్‌లో తమ ఆటగాళ్లు నాలుగు సార్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఉత్తర భారత ఫ్రాంచైజీ యజమాని స్వయంగా వెల్లడించింది.

క్రిక్‌బజ్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన వన్డే, టెస్ట్ జట్టులో వీరిని ఈ కారణంగానే ఎంచుకోలేదని తెలుస్తోంది. ఆటగాళ్ల ఆఫ్-ఫీల్డ్ ప్రవర్తనే ఇందుకు కారణమని తెలుస్తోంది.

బహుశా వన్డే, టెస్టు జట్టులో కొందరు ఆటగాళ్లు ఎంపిక కాకపోవడానికి ఇదే కారణం కావచ్చు. అయితే, వెస్టిండీస్ టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించినప్పుడే ఆ ఆటగాళ్ల పేర్లు తేలనుంది. ఎందుకంటే ఈ విషయాల్లో బీసీసీఐ అనుసరిస్తున్న కఠినత చూస్తుంటే వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో కూడా వారికి చోటు దక్కడం కష్టమేనని తెలుస్తోంది.





























