- Telugu News Photo Gallery Do you know who is the youngest captain to win ODI World Cup check top 4 list here Kapil Dev Ms Dhoni
ODI World Cup: వన్డే ప్రపంచకప్ గెలిచిన అతి పిన్న వయస్కుడైన కెప్టెన్ ఎవరో తెలుసా? టాప్ 4 లిస్టులో ఇద్దరు భారతీయులు..
ODI World Cup 2023: 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అప్పుడు ధోనీ వయసు 29 ఏళ్లు. కానీ, వన్డే ప్రపంచకప్ గెలిచిన అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు మరో భారత కెప్టెన్ పేరిట ఉండటం విశేషం. వన్డే వరల్డ్ కప్‌ను అందుకున్న అతి పిన్న వయస్కుడైన కెప్టెన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 29, 2023 | 8:43 AM

ODI World Cup 2023: వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైన తర్వాత, ఈసారి ఏ జట్టు కప్ గెలుస్తుందనే లెక్కలు మొదలయ్యాయి. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి.

గతసారి ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు ఛాంపియన్‌గా నిలవగా, కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. చివరిసారిగా 2011లో టీమిండియా వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అప్పుడు ధోనీ వయసు 29 ఏళ్లు. కానీ, వన్డే ప్రపంచకప్ గెలిచిన అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు మరో భారత కెప్టెన్ పేరిట ఉండటం విశేషం. వన్డే వరల్డ్ కప్‌ను అందుకున్న అతి పిన్న వయస్కుడైన కెప్టెన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

1- కపిల్ దేవ్: 1983లో భారత జట్టు పటిష్టమైన వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న కపిల్ దేవ్ వయసు 24 ఏళ్లు మాత్రమే. అంటే 24 ఏళ్ల వయసులో వన్డే ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ ఆ రికార్డు అలాగే మిగిలిపోయింది

2- రికీ పాంటింగ్: 2003లో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌లో భారత జట్టును ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఆ సమయంలో ఆసీస్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న రికీ పాంటింగ్ వయసు కేవలం 28 ఏళ్లు. దీంతో వన్డే ప్రపంచకప్‌ను అందుకున్న 2వ అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా నిలిచాడు.

3- మహేంద్ర సింగ్ ధోని: 2011లో శ్రీలంకను ఓడించిన టీమిండియా 2వ సారి ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ సమయంలో 29 ఏళ్ల ధోనీ భారత జట్టును విజయవంతంగా ట్రోఫీ వైపు నడిపించాడు. దీంతో ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు.

4- క్లైవ్ లాయిడ్: 1975లో వెస్టిండీస్ ఆస్ట్రేలియా చేతిలో ఓడి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. 30 ఏళ్ల క్లైవ్ లాయిడ్ అప్పుడు కరేబియన్ దళానికి నాయకత్వం వహించాడు. దీంతో 30 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసులో వన్డే ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయిన కెప్టెన్ల జాబితాలో క్లైవ్ లాయిడ్ కూడా ఉన్నాడు.





























