AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: 42 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. కళ్లు చెదిరే ఈ క్యాచ్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

Stuart Binny Catch Video: 42 ఏళ్ల వయసులో స్టువర్ట్ బిన్నీ (Stuart Binny) చేసిన అద్భుత క్యాచ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2026లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫవాద్ అహ్మద్‌ను ఔట్ చేసేందుకు బిన్నీ ఎడమవైపు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. ఈ వికెట్‌తో భారత్ విజయం ఖాయమైంది.

Viral Video: 42 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. కళ్లు చెదిరే ఈ క్యాచ్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
Stuart Binny Catch Video
Venkata Chari
|

Updated on: Oct 04, 2026 | 10:06 AM

Share

Stuart Binny Catch Video: క్రికెట్‌లో క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంటాయి. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026 ఆరంభ మ్యాచ్‌లో స్టువర్ట్ బిన్నీ చేసిన క్యాచ్ దీనికి మంచి ఉదాహరణగా నిలిచింది. భారత్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ మధ్య జరిగిన పోరులో చివరి వికెట్ కోసం బిన్నీ అద్భుతంగా స్పందించాడు. పియూష్ చావ్లా వేసిన బంతిని ఫవాద్ అహ్మద్ లెగ్ సైడ్‌లోకి ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్‌కు సరైన ఎలివేషన్ రాకపోవడంతో బంతి మిడ్ వికెట్ వైపు తక్కువ ఎత్తులో దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బిన్నీ క్షణాల్లో ఎడమవైపు డైవ్ చేసి బంతి నేలను తాకకముందే పట్టేశాడు.

ఈ క్యాచ్‌తో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 17వ ఓవర్‌లో ఫవాద్ వికెట్ పడటంతో ఆస్ట్రేలియా 150 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత్ ఛాంపియన్స్ 46 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. ఈ విజయంతో జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: 351 పరుగులు చేసినా ఓటమి.. ఆ నిర్ణయమే టీమిండియా కొంపముంచిదా..?

అంతకుముందు భారత్ ఛాంపియన్స్ బ్యాటింగ్‌లో 196 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ (Yuvraj Singh) 44 బంతుల్లో 71 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. యూసుఫ్ పఠాన్, రిషి ధావన్ కూడా కీలక పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తరఫున డి ఆర్సీ షార్ట్ 65, జో బర్న్స్ 45 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో ఎక్కువ మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయే సమయానికి 16 ఓవర్లలో 150 పరుగులు చేసింది. మరో వికెట్ పడితే భారత్ విజయం ఖాయమయ్యే పరిస్థితిలో చావ్లా బంతిని అందుకున్నాడు. ఫవాద్ భారీ షాట్‌కు ప్రయత్నించగా బిన్నీ తన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని చూపించాడు. మ్యాచ్‌ను ముగించిన ఆ క్యాచ్ ప్రత్యేకంగా నిలిచింది.

ఎక్కువమంది చదివినది: ఈ జట్టుతో వన్డే వరల్డ్ కప్‌నకు పోతే పరువుపోద్ది.. ఈ ఇద్దరిని తప్పించి, ఆ ఇద్దర్ని పిలవండి..!

బిన్నీకి WCLలో ఇది కొత్త విషయం కాదు. 2025 సీజన్‌లో మూడు ఇన్నింగ్స్‌లలో 122 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ 167.12గా ఉంది. ఒక అర్ధశతకం సాధించడంతో పాటు తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాదాడు. ఇంగ్లండ్ ఛాంపియన్స్‌పై కేవలం 13 బంతుల్లో 35 పరుగులు చేసిన ఇన్నింగ్స్ అతని అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాతబస్తీలో అర్ధరాత్రి హైడ్రామా.. భారీగా భద్రతా బలగాల ఎంట్రీ!
పాతబస్తీలో అర్ధరాత్రి హైడ్రామా.. భారీగా భద్రతా బలగాల ఎంట్రీ!
42 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో చూస్తే ఫిదానే..!
42 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో చూస్తే ఫిదానే..!
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ
పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ
విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?
విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?
భారత్‌-పాక్‌ మధ్య దౌత్య ఉద్రిక్తత.. పంజాబ్‌ సరిహద్దుపై మళ్లీ రగడ
భారత్‌-పాక్‌ మధ్య దౌత్య ఉద్రిక్తత.. పంజాబ్‌ సరిహద్దుపై మళ్లీ రగడ
పెద్దల పంచాయితీ తర్వాత ఏమైంది? విజయవాడలో ప్రేమజంట విషాదాంతం
పెద్దల పంచాయితీ తర్వాత ఏమైంది? విజయవాడలో ప్రేమజంట విషాదాంతం