భారతదేశంలో వీధి వీధికెళ్లి జల్లెడ పట్టినా అలాంటి ప్లేయర్ దొరకడు గంభీర్..: గవాస్కర్ సంలచన కామెంట్స్..!
Hardik Pandya Replacement: హార్దిక్ పాండ్యా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, అతడి లాంటి ఆల్ రౌండర్ కోసం వెతకడం మానుకోవాలని సునీల్ గవాస్కర్ టీమిండియాకు సూచించారు. జట్టులోని ఇతర స్థానాలపై దృష్టి సారించాలని, నమన్ ధీర్, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లను ప్రోత్సహించాలని అన్నారు. న్యూజిలాండ్ పర్యటనలో క్యాచ్‌లు వదలకుండా ఫీల్డింగ్, బౌలింగ్ ప్రణాళికలపై శ్రద్ధ చూపాలని సలహా ఇచ్చారు.

Team India Management: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియా జట్టు కూర్పు, భవిష్యత్ వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ పాండ్యాను భర్తీ చేయలేని ఆల్ రౌండర్‌గా అభివర్ణించిన ఆయన, అతడి లాంటి ఆటగాడి కోసం వెతకడం మానుకోవాలని జట్టు యాజమాన్యానికి సలహా ఇచ్చారు. దీనికి బదులుగా జట్టులోని మిగతా స్థానాలపై దృష్టి పెట్టడం మంచిదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
హార్దిక్ స్థానాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని, అతడి లాంటి ఆటగాడు దొరకనప్పుడు, కాస్త భిన్నమైన బాధ్యతలు నిర్వర్తించే ఆటగాళ్లపై దృష్టి పెట్టడం ఉత్తమమని గవాస్కర్ స్పష్టం చేశారు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో నమన్ ధీర్ బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించాడని గుర్తు చేశారు. జట్టులో కనీసం నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు ఉండాలని, ఒకరు లేదా ఇద్దరు బౌలింగ్, బ్యాటింగ్ రెండూ చేయగల ఆల్ రౌండర్లు ఉండాలని ఆయన అన్నారు.
అక్షర్ పటేల్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి, బ్యాటింగ్‌లోనూ ఉపయోగపడగల మంచి ఆల్ రౌండర్ అని గవాస్కర్ ప్రశంసించారు. ప్రస్తుతం నమన్ ధీర్ కూడా ఆల్ రౌండర్‌గా మంచి అడుగులు వేస్తున్నాడని తెలిపారు. ప్రత్యేకమైన హార్దిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ కోసం వెతకడం మానేసి, ఉన్న ఆల్ రౌండర్లతో జట్టును నడిపించడం చాలా మేలని, లేదంటే బ్యాటింగ్ ఆర్డర్ గాడి తప్పి, ఫలితంపై ప్రభావం పడుతుందని సునీల్ గవాస్కర్ హెచ్చరించారు.
ఎక్కువమంది చదివినది: శాంసన్, అయ్యర్ కాదు.. 15 బంతుల్లో మ్యాచ్ రిజల్ట్ మార్చేసిన రోహిత్ ఫ్రెండ్
ఇదిలా ఉండగా, న్యూజిలాండ్‌లో అడుగు పెట్టబోతున్న టీమిండియాకు గవాస్కర్ ఓ సలహా ఇచ్చారు. అక్కడ చిన్న అవకాశాన్ని కోల్పోయినా కూడా మ్యాచ్ స్వరూపమే మారిపోతుందని హెచ్చరించారు. మనకంటే గొప్ప ఫీల్డర్లు న్యూజిలాండ్‌లో ఉన్నారని, ఏ చిన్న క్యాచ్‌ను నేలపాలు చేసినా మ్యాచ్‌పై ప్రభావం పడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఫీల్డింగ్‌పై ఫోకస్ పెట్టాలని, అలాగే బౌలింగ్‌లో న్యూజిలాండ్ పరిస్థితులకు తగ్గట్లుగా పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగాల్సి ఉంటుందని సునీల్ గవాస్కర్ సూచించారు.
