AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Vishwakarma Yojana: కేంద్రం నుంచి బెస్ట్‌ స్కీమ్‌.. రూ.15,000 టూల్‌కిట్ సాయం, రూ.3 లక్షల వరకు రుణం..!

PM Vishwakarma Yojana: కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన చేతివృత్తుల వారికి నైపుణ్య శిక్షణతో పాటు పనిముట్ల కొనుగోలుకు ఆర్థిక సాయం, సొంతంగా వ్యాపారం..

PM Vishwakarma Yojana: కేంద్రం నుంచి బెస్ట్‌ స్కీమ్‌.. రూ.15,000 టూల్‌కిట్ సాయం, రూ.3 లక్షల వరకు రుణం..!
Pm Vishwakarma Yojana
Subhash Goud
|

Updated on: Oct 24, 2026 | 8:08 AM

Share

PM Vishwakarma Yojana: చేతివృత్తులు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం విశ్వకర్మ యోజన ద్వారా శిక్షణ, రోజుకు రూ.500 స్టైపెండ్, పనిముట్ల కొనుగోలుకు రూ.15,000 వరకు ఆర్థిక సాయం, తక్కువ వడ్డీకి రుణం పొందే అవకాశం ఉంది. ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సమస్యలు వస్తే ఎక్కడ సంప్రదించాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన చేతివృత్తుల వారికి నైపుణ్య శిక్షణతో పాటు పనిముట్ల కొనుగోలుకు ఆర్థిక సాయం, సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి రుణ సదుపాయం కల్పిస్తున్నారు. తమ వృత్తిని అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు అదిరిపోయే శుభవార్త.. పండగకు ముందు పీఎం కిసాన్‌ డబ్బులు. డేట్‌ ఫిక్స్‌..!

పీఎం విశ్వకర్మ యోజన ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ పథకం కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు పలు ప్రయోజనాలు అందిస్తారు.

1. శిక్షణ సమయంలో రోజుకు రూ.500: లబ్ధిదారులకు వారి వృత్తికి సంబంధించిన నైపుణ్య శిక్షణ అందిస్తారు. శిక్షణ కాలంలో నిబంధనలకు అనుగుణంగా రోజుకు రూ.500 స్టైపెండ్ చెల్లిస్తారు.

2. పనిముట్ల కొనుగోలుకు రూ.15,000 వరకు సాయం: వృత్తికి అవసరమైన పనిముట్లు కొనుగోలు చేసేందుకు అర్హులైన లబ్ధిదారులకు రూ.15,000 వరకు టూల్‌కిట్ ప్రోత్సాహక సాయం అందిస్తారు.

3. సొంత వ్యాపారం కోసం రూ.3 లక్షల వరకు రుణం: ఈ పథకం కింద అర్హులైన వారికి రెండు దశల్లో రుణ సదుపాయం కల్పిస్తారు.

  • మొదటి దశ: రూ.1 లక్ష వరకు రుణం.
  • రెండో దశ: రూ.2 లక్షల వరకు అదనపు రుణం.

మొదటి దశ రుణాన్ని 18 నెలల వ్యవధిలో, రెండో దశ రుణాన్ని 30 నెలల వ్యవధిలో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే రెండో దశ రుణం పొందడానికి పథకం నిబంధనలు, అర్హతలు వర్తిస్తాయి. ఈ రుణాలు తక్కువ వడ్డీ రేటుతో అందించేలా పథకాన్ని రూపొందించారు.

పీఎం విశ్వకర్మ యోజనకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

సంప్రదాయ చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారు ఈ పథకానికి అర్హత పొందే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కింది వృత్తులకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు:

1. వడ్రంగులు

2. కమ్మరులు

3. స్వర్ణకారులు

4. కుమ్మరులు

5. చెప్పులు కుట్టేవారు, చెప్పుల తయారీదారులు

6. దర్జీలు

7. క్షురకులు

8. చాకళ్లు

9. తాళాలు తయారు చేసేవారు

10. శిల్పులు, రాతి శిల్పకారులు

11. రాతి పనివారు

12. రాజమేస్త్రీలు

13. బుట్టలు, చాపలు, చీపుర్లు తయారు చేసేవారు

14. బొమ్మలు, సంప్రదాయ ఆటవస్తువులు తయారు చేసేవారు

15. పడవలు తయారు చేసేవారు

16. చేపలు పట్టే వలలు తయారు చేసేవారు

17. సుత్తులు, ఇతర సంప్రదాయ పనిముట్లు తయారు చేసేవారు

18. పూలదండలు తయారు చేసేవారు.

గమనిక: పై వృత్తుల్లో ఉండటం మాత్రమే సరిపోదు. వయస్సు, కుటుంబానికి సంబంధించిన నిబంధనలు, ఇతర అర్హత ప్రమాణాలు కూడా వర్తిస్తాయి. దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక మార్గదర్శకాలను పరిశీలించాలి.

పీఎం విశ్వకర్మ యోజనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఈ పథకానికి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియలో అవసరమైన వివరాలను అందించాలి.

దరఖాస్తు విధానం:

1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అధికారిక వెబ్‌సైట్: PM Vishwakarma అధికారిక పోర్టల్

2. సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాన్ని సంప్రదించండి:  మీకు స్వయంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం తెలియకపోతే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి సహాయం తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us