AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా కూడా మోసం చేస్తారా.. బంగారం కొని అడవుల్లో వదిలేస్తున్న జనం.. అసలు ఏం జరుగుతోంది?

సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. తమ పొదుపును కాపాడుకోవడానికి పౌరులు బంగారం కొనుగోలు చేసి, దాని విలువ పెరుగుతుందనే నమ్మకంతో అడవుల్లో వదిలేయాలని కొందరు కేటుగాళ్లు మోసపూరిత సూచనలు ఇస్తున్నారు. ఇలా అడవిలో వదిలిన బంగారం మాయం కావడంతో బాధితులు భారీగా నష్టపోతున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి బ్యాంకులు ఒక ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. అసలు విషయంలోకి వెళితే..

ఇలా కూడా మోసం చేస్తారా.. బంగారం కొని అడవుల్లో వదిలేస్తున్న జనం.. అసలు ఏం జరుగుతోంది?
Forest Gold ScamImage Credit source: AI image
Jyothi Gadda
|

Updated on: Oct 24, 2026 | 8:19 AM

Share

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మోసాలు రోజురోజుకూ కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. తాజాగా నార్వేలో వెలుగు చూసిన ఒక విచిత్రమైన మోసం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తమ కష్టపడి సంపాదించుకున్న డబ్బును రక్షించుకోవడానికి బంగారం కొనాలని, ఆపై దానిని భద్రంగా ఉంచే పేరుతో అడవుల్లో వదిలిపెట్టాలని మోసగాళ్ళు పన్నాగం పన్నారు. ఈ వినూత్న మోసాల బారిన పడి నార్వే పౌరులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు.

మోసం ఎలా జరుగుతుంది?

నార్వేలో ప్రస్తుతం ఆర్థిక అస్థిరత నుంచి తమ పొదుపును కాపాడుకోవడానికి చాలామంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు కేటుగాళ్లు పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. బంగారం కొనుగోలు చేసి, దాని విలువ కాలక్రమేణా పెరుగుతుందని నమ్మబలికారు. అంతేకాకుండా, ఆ బంగారాన్ని మరింత సురక్షితంగా ఉంచేందుకు అడవుల్లోని నిర్దిష్ట ప్రదేశాలలో వదిలిపెట్టాలని సూచించారు. వారు చెప్పిన మాట నమ్మి అమాయకులు బంగారం కొని అడవుల్లో వదిలేయగా, కొద్దిసేపటికే అది మాయం అవుతోంది. చివరికి బాధితులు తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు.

ఆందోళన వ్యక్తం చేస్తున్న బ్యాంకులు:

నార్వే రాజధాని ఓస్లోతో పాటు బెర్గెన్ వంటి ప్రధాన నగరాల్లో ఈ రకమైన మోసాలు వెలుగు చూశాయి. ఈ విచిత్రమైన స్కామ్‌పై నార్వే ఆర్థిక సేవల పరిశ్రమ సంస్థ ‘ఫినాన్స్ నార్గే’ (Finans Norge) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులు తాము నష్టపోయిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకోలేని దుస్థితిలో ఉన్నారని అధికారులు తెలిపారు. గత ఏడాది నార్వేలో వివిధ ఆర్థిక మోసాల ద్వారా పౌరులు, బ్యాంకులు సుమారు 962 మిలియన్ క్రోనర్ల (సుమారు 100 మిలియన్ డాలర్లు) వరకు నష్టపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

అవగాహన ప్రచారం ప్రారంభం:

ఈ తరహా వినూత్న మోసాల బారిన పడకుండా ప్రజలను రక్షించడానికి నార్వేజియన్ బ్యాంకులు నడుం బిగించాయి. నో వే – యు వోంట్ ఫూల్ మీ పేరుతో ఒక ప్రత్యేక ప్రజా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎలాంటి పెట్టుబడులు పెట్టే ముందైనా, ముఖ్యంగా విలువైన వస్తువులను అసాధారణ ప్రదేశాలలో భద్రపరచమనే విచిత్రమైన సూచనలు వస్తే అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లావాదేవీలపై తక్షణమే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఈ ప్రచారం ద్వారా హెచ్చరిస్తున్నారు. బంగారం సురక్షితమైనదే అయినప్పటికీ, మోసపూరిత సలహాలను నమ్మి విలువైన ఆస్తులను గాలికి వదిలేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us