AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: వెస్టిండీస్ సిరీస్ తర్వాత.. కోహ్లీ, రోహిత్ మళ్లీ మ్యాచ్ ఆడేది ఎప్పుడంటే..?

India vs New Zealand ODI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముగిసింది. ఇప్పుడు భారత అభిమానుల దృష్టి విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) తదుపరి వన్డే మ్యాచ్‌లపై ఉంది. ఇద్దరూ న్యూజిలాండ్ పర్యటనలో తిరిగి బరిలోకి దిగనున్నారు. ఐదు వన్డేల సిరీస్ నవంబర్ 4న ఆక్లాండ్ వేదికగా మొదలవుతుంది.

IND vs NZ: వెస్టిండీస్ సిరీస్ తర్వాత.. కోహ్లీ, రోహిత్ మళ్లీ మ్యాచ్ ఆడేది ఎప్పుడంటే..?
Virat Kohli, Rohit Sharma
Venkata Chari
|

Updated on: Oct 04, 2026 | 8:55 AM

Share

Virat Kohli, Rohit Sharma: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముగిసిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదుపరి వన్డే మ్యాచ్‌ల కోసం న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధం కానున్నారు. టెస్టు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌లో మాత్రం భారత ప్రణాళికల్లో కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇద్దరి అనుభవం జట్టుకు కీలకంగా ఉంది. న్యూజిలాండ్‌తో భారత్ ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ నవంబర్ 4న ఆక్లాండ్‌లో జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 7న వెల్లింగ్టన్, నవంబర్ 10న హామిల్టన్‌లో మ్యాచ్‌లు ఉంటాయి. నాలుగో, ఐదో వన్డేలు నవంబర్ 13, 15 తేదీల్లో మౌంట్ మౌంగనుయ్‌లో జరగనున్నాయి.

ఈ వన్డే సిరీస్‌కు ముందు భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ పోటీలు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు కొనసాగుతాయి. ఆ సిరీస్ ముగిసిన తరువాత వన్డే పోరుకు తెరలేవనుంది.

ఎక్కువమంది చదివినది: 351 పరుగులు చేసినా ఓటమి.. ఆ నిర్ణయమే టీమిండియా కొంపముంచిదా..?

వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ మంచి ఫామ్‌లో కనిపించాడు. మూడు ఇన్నింగ్స్‌లలో 168 పరుగులు చేసిన అతని సగటు 84.00 కాగా, స్ట్రైక్‌రేట్ 155.56గా ఉంది. తొలి వన్డేలోనే సెంచరీ సాధించిన కోహ్లీ 88 బంతుల్లో 139 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదే సిరీస్‌లో 15,000 వన్డే పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.

రోహిత్ కూడా వెస్టిండీస్ సిరీస్‌లో మంచి పరుగులు సాధించాడు. మూడు ఇన్నింగ్స్‌లలో 225 పరుగులు చేసిన అతని సగటు 112.50గా ఉంది. తొలి వన్డేలో 35 బంతుల్లో 32 పరుగులు చేసిన రోహిత్, రెండో మ్యాచ్‌లో 75 బంతుల్లో 101 పరుగుల సెంచరీ నమోదు చేశాడు. మూడో వన్డేలో 83 బంతుల్లో 92 పరుగులు చేశాడు.

ఎక్కువమంది చదివినది: ఈ జట్టుతో వన్డే వరల్డ్ కప్‌నకు పోతే పరువుపోద్ది.. ఈ ఇద్దరిని తప్పించి, ఆ ఇద్దర్ని పిలవండి..!

న్యూజిలాండ్‌తో వన్డేల్లో కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఆ జట్టుపై 36 ఇన్నింగ్స్‌లలో 1,897 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ గడ్డపై 13 ఇన్నింగ్స్‌లలో 596 పరుగులు సాధించాడు. రోహిత్ న్యూజిలాండ్‌పై 32 ఇన్నింగ్స్‌లలో 1,134 పరుగులు చేశాడు. అక్కడి పరిస్థితుల్లో 13 ఇన్నింగ్స్‌లలో 437 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్‌తో భారత్ వన్డే సిరీస్..

నవంబర్ 4, 2026 – తొలి వన్డే – ఆక్లాండ్

నవంబర్ 7, 2026 – రెండో వన్డే – వెల్లింగ్టన్

నవంబర్ 10, 2026 – మూడో వన్డే – హామిల్టన్

నవంబర్ 13, 2026 – నాలుగో వన్డే – మౌంట్ మౌంగనుయి

నవంబర్ 15, 2026 – ఐదో వన్డే – మౌంట్ మౌంగనుయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us