AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: వైభవ్ ఇన్.. తిలక్ ఔట్.. రెండో టీ20లో భారత్ ప్లేయింగ్ 11 ఇదే..?

IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌తో రెండో టీ20 కోసం భారత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్ కిషన్ అందుబాటులో లేకపోవడంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. తిలక్ వర్మ స్థానంలో శివమ్ దూబేను కూడా తీసుకునే ఛాన్స్ ఉంది.

IND vs NZ: వైభవ్ ఇన్.. తిలక్ ఔట్.. రెండో టీ20లో భారత్ ప్లేయింగ్ 11 ఇదే..?
Ind Vs Nz
Venkata Chari
|

Updated on: Oct 24, 2026 | 6:45 AM

Share

IND vs NZ 2nd T20: భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా అక్టోబర్ 24న జరగనున్న ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సారథ్యంలోని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

తొలి టీ20లో విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్ విజయానికి మరింత చేరువ అవుతుంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ (Ishan Kishan) గాయం కారణంగా రెండో మ్యాచ్‌కు దూరం కావడం భారత జట్టు కూర్పుపై ప్రభావం చూపనుంది.

ఇషాన్ కిషన్ సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. తొలి టీ20లో గాయపడిన అతడు రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. దీంతో సంజూ శాంసన్ (Sanju Samson) ఓపెనింగ్ స్థానాన్ని వదిలి వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

అదే జరిగితే యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. వైభవ్ ఇప్పటివరకు భారత్ తరఫున ఆడిన ఎనిమిది టీ20 మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. దీంతో అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం అతడికి లభించవచ్చు.

తిలక్ వర్మకు బదులుగా దూబే?

మరోవైపు తిలక్ వర్మ (Tilak Varma) స్థానంపైనా చర్చ జరుగుతోంది. తొలి టీ20లో ఇషాన్ గాయపడటంతో తిలక్‌కు మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అయితే అతడు 11 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

దీంతో రెండో టీ20లో తిలక్ స్థానంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే (Shivam Dube)ను తీసుకునే అవకాశం ఉందని సమాచారం. బ్యాటింగ్‌లో భారీ షాట్లు ఆడగల దూబేకు క్రైస్ట్‌చర్చ్ మైదానం కూడా అనుకూలంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అవసరమైన సమయంలో మీడియం పేస్ బౌలింగ్‌తోనూ అతడు జట్టుకు ఉపయోగపడగలడు.

రెండో టీ20లో భారత్ తుది జట్టు ఎలా ఉండొచ్చు?

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

తొలి మ్యాచ్‌లో సాధించిన విజయాన్ని కొనసాగిస్తూ సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించడమే భారత్ ముందున్న ప్రధాన లక్ష్యం. వైభవ్ సూర్యవంశీకి అవకాశం లభిస్తే.. యువ ఆటగాడి ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొనడం ఖాయం.

Follow Us