IND vs ENG: నిరాశపర్చిన టీమిండియా బ్యాటర్లు.. మొదటి టీ20లో ఇంగ్లండ్‌ ఘన విజయం

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు విజయం సాధించింది. 38 పరుగుల తేడాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేనపై ఇంగ్లండ్‌ టీమ్‌ గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

IND vs ENG: నిరాశపర్చిన టీమిండియా బ్యాటర్లు.. మొదటి టీ20లో ఇంగ్లండ్‌ ఘన విజయం
Ind W Vs Eng W
Follow us
Basha Shek

|

Updated on: Dec 07, 2023 | 6:15 AM

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు విజయం సాధించింది. 38 పరుగుల తేడాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేనపై ఇంగ్లండ్‌ టీమ్‌ గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్లుగానే రేణుకా సింగ్ దాడిని నిర్వహించి తొలి ఓవర్ 4వ బంతికి సోఫియా డంక్లీ (1) వికెట్‌ తీసింది. దీని తర్వాత అలిస్ క్యాప్సీ (0) కూడా పెవిలియన్ బాట పట్టింది. అయితే మరోవైపు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించింది డేనియల్ వ్యాట్. టీమిండియా బౌలర్లను చితక బాది 47 బంతుల్లో 2 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 75 పరుగులు చేసింది. ఈ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 140కి చేరింది. ఆ తర్వాత నేట్ షివర్-బ్రంట్ భీకరమైన బ్యాటింగ్‌తో భారత బౌలర్లను బెంబేలెత్తించారు. బ్రంట్ 53 బంతుల్లో 13 ఫోర్లతో 77 పరుగులు చేయగా.. ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

198 పరుగుల కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు స్మృతి మంధాన శుభారంభం అందించలేకపోయింది. 6 పరుగులు మాత్రమే చేసిన మంధాన తొలుత ఔట్ కాగా, ఆ తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ 4 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 26 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయింది. అయితే మరోవైపు ఓపెనర్ షఫాలీ వర్మ దూకుడుగా బ్యాటింగ్‌ చేసింది. 37 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసింది. మరోవైపు రిచా ఘోష్ 16 బంతుల్లో 21 పరుగులు చేసింది. ఫలితంగా చివరి 5 ఓవర్లలో టీమిండియాకు 74 పరుగులు కావాలి. కానీ ఈ దశలో 52 పరుగులు చేసిన షఫాలీ వర్మ ఎక్లెస్టోన్ చేతికి చిక్కింది.దీంతో మ్యాచ్ పై పూర్తి పట్టు సాధించిన ఇంగ్లిష్ బౌలర్లు చివరి ఓవర్లలో పరుగులను అదుపు చేయగలిగారు. చివరకు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసిన టీమిండియా 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. రెండో మ్యాచ్ డిసెంబర్ 9న, మూడో మ్యాచ్ డిసెంబర్ 10న జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

షెఫాలీ శ్రమ వృథా..

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాంకా పాటిల్, కనికా అహుజా, పూజా వస్త్రాకర్, రేణుకా ఠాకూర్ సింగ్, సైకా ఇషాక్.

ఇంగ్లండ్ ప్లేయింగ్ XI:

డేనియల్ వాట్, సోఫియా డంక్లీ, అలిస్ క్యాప్సే, నాట్ స్కివర్-బ్రంట్, హీథర్ నైట్ (కెప్టెన్), అమీ జోన్స్ (వికెట్ కీపర్), ఫ్రెయా కెంప్, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, లారెన్ బెల్, మహికా

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..