AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 3rd Test: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత జట్టులో చేరిన స్టార్ ఆల్ రౌండర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు చుక్కలే..

India vs England, 3rd Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు నాలుగో రోజైన ఆదివారం ఆఫ్‌స్పిన్నర్ ఆర్ అశ్విన్ భారత జట్టులో చేరనున్నాడు. ఈ మేరకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) ఆదివారం ట్వీట్‌ చేసింది. మూడో మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగియగానే తల్లి అనారోగ్య కారణాలతో అశ్విన్ చెన్నై వెళ్లాడు. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్ చేసి, సమాచారం అందించింది. ఆర్ అశ్విన్ నాల్గవ రోజు ఆటలో తిరిగి రానున్నాడు.

IND vs ENG 3rd Test: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత జట్టులో చేరిన స్టార్ ఆల్ రౌండర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు చుక్కలే..
Ind Vs Eng 3rd Test Ashwin
Venkata Chari
|

Updated on: Feb 18, 2024 | 12:10 PM

Share

India vs England, 3rd Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు నాలుగో రోజైన ఆదివారం ఆఫ్‌స్పిన్నర్ ఆర్ అశ్విన్ భారత జట్టులో చేరనున్నాడు. ఈ మేరకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) ఆదివారం ట్వీట్‌ చేసింది. మూడో మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగియగానే తల్లి అనారోగ్య కారణాలతో అశ్విన్ చెన్నై వెళ్లాడు. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్ చేసి, సమాచారం అందించింది. ఆర్ అశ్విన్ నాల్గవ రోజు ఆటలో తిరిగి రానున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో జట్టుకు సహకారం అందించేందుక సిద్ధమయ్యాడు. అశ్విన్ సెలవులో ఉన్నందున మూడో రోజు మైదానంలోకి రాలేదు.

500 టెస్టు వికెట్ల క్లబ్‌లో రెండో భారత ఆటగాడిగా అశ్విన్..

రవిచంద్రన్ అశ్విన్ రాజ్‌కోట్ టెస్టులో శుక్రవారం టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని అందుకున్న రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు అనిల్ కుంబ్లే 105 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా విరాట్ కూడా ఔట్..

మీడియా కథనాల ప్రకారం కుటుంబ కారణాల వల్ల విరాట్ కోహ్లీ విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండో టెస్టు తర్వాత అతనికి సంబంధించిన ప్రశ్నలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ, సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి టీమ్ మేనేజ్‌మెంట్ కోహ్లీని సంప్రదిస్తుందని చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా విరాట్ ఇప్పటి వరకు టెస్టు సిరీస్‌లో ఏ మ్యాచ్ ఆడలేకపోయాడు.

మ్యాచ్ గురించి మాట్లాడితే..

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరుగుతోంది. నిరంజన్ షా స్టేడియంలో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 319 పరుగులు చేసింది. ప్రస్తుతం నాలుగో రోజు తొలి సెషన్‌ ఆట ముగిసింది. లంచ్ వరకు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(149), సర్ఫరాజ్ ఖాన్(22) క్రీజులో ఉన్నారు. 27 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్, 91 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యారు.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్.

ఇంగ్లండ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్ మరియు జేమ్స్ ఆండర్సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !