CWC 2023 Points Table: తొలి విజయంతో సత్తా చాటిన ఆసీస్.. పాయింట్ల పట్టికలో మారిన ప్లేస్‌లు.. టాప్ 4 జట్లు ఇవే..
గత రాత్రి లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఎట్టకేలకు ప్రపంచకప్‌లో తన పాయింట్ల ఖాతాను తెరిచింది. మిచిల్ మార్ష్(52), జోష్ ఇంగ్లిస్(58) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అలాగే, మర్నాస్ లబూషేన్(40) మిడిలార్డర్‌లో దంచికొట్టగా.. చివర్లో మ్యాక్స్‌వెల్(29) మెరుపులు కంగారూలకు విజయాన్ని కట్టబెట్టాయి. లంక బౌలర్లలో మధుశంక(3/38) 3 వికెట్లు పడగొట్టగా.. వేల్లలాగే(1/53) ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి.

CWC 2023 Points Table: ఐసీసీ పురుషుల ODI క్రికెట్ ప్రపంచ కప్ 2023 (CWC 2023) అక్టోబర్ 5 నుంచి భారతదేశంలో మొదలైంది. ఈ ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్‌తో పాటు ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పాల్గొంటున్నాయి.
ఈ టోర్నమెంట్ రౌండ్ రాబిన్ ప్రాతిపదికన జరుగుతుంది. అన్ని జట్లు ఒకదానితో ఒకటి ఆడతాయి. నవంబర్ 15, 16 తేదీల్లో జరిగే సెమీ ఫైనల్స్‌కు 10 జట్లలో టాప్ 4 జట్లు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్‌లో గెలిచిన జట్లు నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌లో తలపడతాయి.




కాగా, గత రాత్రి లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఎట్టకేలకు ప్రపంచకప్‌లో తన పాయింట్ల ఖాతాను తెరిచింది. మిచిల్ మార్ష్(52), జోష్ ఇంగ్లిస్(58) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అలాగే, మర్నాస్ లబూషేన్(40) మిడిలార్డర్‌లో దంచికొట్టగా.. చివర్లో మ్యాక్స్‌వెల్(29) మెరుపులు కంగారూలకు విజయాన్ని కట్టబెట్టాయి. లంక బౌలర్లలో మధుశంక(3/38) 3 వికెట్లు పడగొట్టగా.. వేల్లలాగే(1/53) ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి.
CWC 2023 పాయింట్ల పట్టిక..
View this post on Instagram




