AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC New Rule: ఆటగాళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఐసీసీ.. కొత్త రూల్‌తో పెనాల్టీలో కీలక మార్పులు..

ICC Slow Over-Rate: ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. దీంతో ఆటగాళ్ల జేబులు నిండనున్నాయి.

ICC New Rule: ఆటగాళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఐసీసీ.. కొత్త రూల్‌తో పెనాల్టీలో కీలక మార్పులు..
Icc New Rule
Venkata Chari
|

Updated on: Jul 14, 2023 | 3:45 PM

Share

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండు ఎడిషన్‌లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు మూడవ ఎడిషన్ కూడా ప్రారంభమైంది. టెస్టు ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్‌తో ప్రారంభమైంది. ఇందులో భాగంగా భారత్-వెస్టిండీస్ (IND vs WI) మధ్య టెస్ట్ సిరీస్ కూడా జరుగుతోంది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ తొలి రెండు ఎడిషన్‌ల అద్భుత విజయం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అంటే టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కొన్ని కీలక మార్పులు తీసుకురావాలని ఐసీసీ యోచిస్తోంది. దీంతో ఆటగాళ్ల జేబులు నిండనున్నాయని తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఐసీసీ వార్షిక సమావేశం జరుగుతోంది. బీసీసీఐ కార్యదర్శి జే షా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సదస్సులోనే పలు కీలక నిర్ణయాలు తీసుకోగా, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో స్లో ఓవర్ రేట్‌కు సంబంధించి విధించిన శిక్షను మార్చాలని ఐసీసీ నిర్ణయానికి వచ్చింది.

పెనాల్టీని తగ్గించిన ఐసీసీ..

ఐసీసీ తన పత్రికా ప్రకటనలో జులై 13, గురువారం జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి తెలియజేసింది. టెస్ట్ క్రికెట్‌లో స్లో ఓవర్ రేట్‌కు విధించిన శిక్షలో మార్పులను తీసుకువచ్చింది. స్లో ఓవర్ రేట్ విషయంలో జట్ల ఖాతా నుంచి తీసివేసిన పాయింట్లలో ఎలాంటి మార్పు ఉండదని ఐసీసీ స్పష్టం చేసింది. కానీ, ఆటగాళ్ల ఫీజు మినహాయించే నిబంధనలను కొద్దిగా సవరించారు.

ఇవి కూడా చదవండి

కొత్త నిబంధన ప్రకారం, స్లో ఓవర్ రేట్ కోసం ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజులో 5 శాతం పెనాల్టీ నుంచి తీసివేయబడుతుంది. అంటే, స్లో ఓవర్ రేట్ కోసం జట్టుకు జరిమానా విధించినట్లయితే, ఆ జట్టు ఆటగాళ్లు తమ మ్యాచ్ ఫీజులో 5% పెనాల్టీగా చెల్లించాలి. అంతకుముందు స్లో ఓవర్ రేట్ పెనాల్టీ విషయంలో ఒక్కో ఆటగాడి మ్యాచ్ ఫీజులో 10 శాతం పెనాల్టీగా తీసుకునేవారు. ఈ నిబంధన కారణంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు మొత్తం కోతపడింది. ఇప్పుడు, కొత్త నిబంధన ప్రకారం, ఆటగాళ్ల ఫీజులో 50 శాతం మాత్రమే తగ్గించబడుతుంది.

ఇకపై పురుషుల, మహిళలకు సమాన ప్రైజ్ మనీ..

మరో విప్లవాత్మక చర్యలో, పురుషుల, మహిళల క్రికెట్‌లోని అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో ప్రైజ్ మనీ వివక్షను అంతం చేయాలని ఐసీసీ నిర్ణయించింది. అంటే పురుషుల టీ20 ప్రపంచకప్ లేదా వన్డే ప్రపంచకప్‌లో విజేత, రన్నరప్ లేదా ఇతర జట్లు అందుకున్న ప్రైజ్ మనీ మొత్తాన్ని మహిళల టోర్నీలోని జట్లకు కూడా ఇవ్వాలని నిర్ణయించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..