Asia Cup 2023: ఆసియా కప్‌లో భారత్ శుభారంభం.. తుఫాన్ సెంచరీతో దుమ్మురేపిన టీమిండియా నయా సెన్సెషన్..
ACC Emerging asia cup 2023: యూఏఈ-ఏ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన యశ్ ధుల్ కేవలం 84 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్సర్ తో అజేయంగా 108 పరుగులతో నిలిచి, విజయాన్ని అందించాడు.

నిన్నటి నుంచి అంటే జులై 13న శ్రీలంకలో ప్రారంభమైన ACC పురుషుల ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 (ACC Emerging Asia Cup 2023) భారత్-A జట్టు విజయంతో శుభారంభం చేసింది. ఈరోజు (శుక్రవారం) యూఏఈ-ఏ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో యశ్ ధుల్ తుపాన్ సెంచరీతో టీమిండియా కేవలం 27 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యూఏఈ-ఏ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన యశ్ ధుల్ కేవలం 84 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్సర్ తో అజేయంగా 108 పరుగులతో నిలిచి, విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టుకు శుభారంభం లభించలేదు. ఆ జట్టు ఓపెనర్ జోనాథన్ ఫిగీ తాను ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత వచ్చిన అన్ష్ టాండన్ ఐదు పరుగులకే ఇన్నింగ్స్ ముగించగా, నాలుగో నంబర్‌లో వచ్చిన లవ్‌ప్రీత్ బజ్వా కూడా రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు.
4 వికెట్లు పడగొట్టిన హర్షిత్ రాణా..
మరోవైపు వికెట్ పడిపోతున్నా మరో ఓపెనర్ ఆర్యన్‌ష్ శర్మ 42 బంతుల్లో 7 బౌండరీలతో 38 పరుగులు చేసి అవుటయ్యాడు. తద్వారా యూఏఈ జట్టు కేవలం 52 పరుగులకే 4 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్ అశ్వంత్ వాల్తాపా 46 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా, లోయర్ ఆర్డర్‌లో మహ్మద్ ఫరాజుద్దీన్ 35 పరుగులు చేశాడు. చివరికి 50 ఓవర్లు ఆడి యూఏఈ 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టీమిండియా తరపున హర్షిత్ రాణా 4 వికెట్లు తీయగా, నితీష్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్ చెరో 2 వికెట్లు తీశారు.
India ‘A’ win by 8️⃣ wickets 🙌
A clinical chase to secure the first win of the tournament 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/EOqtpUvxoE#ACCMensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/ErwwpIJyBe
— BCCI (@BCCI) July 14, 2023
యశ్ ధుల్ తుఫాన్ బ్యాటింగ్..
ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత్-ఎ జట్టుకు ఆరంభం అంతగా లభంచలేదు. జట్టు స్కోరు 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ సాయి సుదర్శన్ 8 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా 19 పరుగుల వద్ద బ్యాటింగ్‌ని అందుకున్నాడు. ఈ రెండు వికెట్ల పతనం తర్వాత ఇన్నింగ్స్‌కు బాధ్యత వహించిన కెప్టెన్ యశ్ ధుల్ తుఫాన్ బ్యాటింగ్‌తో ముందుకు సాగాడు. మరోవైపు కెప్టెన్ యశ్‌కు సూపర్ సపోర్ట్ అందించిన నిఖిన్ జోష్ కూడా 53 బంతుల్లో 5 బౌండరీలతో అజేయంగా 41 పరుగులు చేశాడు. యశ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి అజేయ సెంచరీతో టోర్నీలో జట్టుకు శుభారంభం అందించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..