AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : మొదలైన వరల్డ్ కప్ సమరం.. టీమిండియా సహా ఐదు జట్లు ఖరారు..సూర్య కెప్టెన్సీలో భారత్ రెడీ!

T20 World Cup 2026 Squads : 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత్, ఇంగ్లండ్ సహా ఐదు దేశాలు తమ జట్లను ప్రకటించాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా స్క్వాడ్ వివరాలు, టోర్నీ ఫార్మాట్ గురించి వివరంగా తెలుసుకుందాం.

T20 World Cup 2026 : మొదలైన వరల్డ్ కప్ సమరం.. టీమిండియా సహా ఐదు జట్లు ఖరారు..సూర్య కెప్టెన్సీలో భారత్ రెడీ!
T20 World Cup 2026 (1)
Rakesh
|

Updated on: Dec 31, 2025 | 3:57 PM

Share

20 World Cup 2026 : క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద సమరానికి సమయం ఆసన్నమైంది. 2026 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి మరో నెల రోజులే సమయం ఉండటంతో స్టేడియాలన్నీ సందడిగా మారాయి. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే ప్రధాన జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. భారత్, ఇంగ్లండ్ సహా ఐదు దేశాలు ఇప్పటికే తమ స్క్వాడ్‌లను ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరాయి.

టోర్నీ ఫార్మాట్ ఎలా ఉండబోతోంది?

ఈసారి టీ20 ప్రపంచ కప్‌లో రికార్డు స్థాయిలో 20 దేశాలు తలపడబోతున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా (ఒక్కో గ్రూపులో 5 జట్లు) విభజించారు. ప్రతి గ్రూపు నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8 దశకు చేరుకుంటాయి. అక్కడి నుంచి మళ్ళీ రెండు గ్రూపుల మధ్య పోటీ జరిగి, టాప్-2 జట్లు సెమీఫైనల్స్ కు వెళ్తాయి. మార్చి 8న జరిగే గ్రాండ్ ఫైనల్‌తో ఈ క్రికెట్ పండుగ ముగుస్తుంది. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్ జట్లు తమ వీరుల జాబితాను విడుదల చేశాయి.

సూర్య సారథ్యంలో యంగ్ బ్లడ్

భారత జట్టు ఈసారి కూడా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది. జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ హిట్టర్లతో పాటు జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా జట్టుకు బలాన్ని ఇస్తుండగా, ఫినిషర్ పాత్రలో రింకూ సింగ్ మెరవనున్నాడు. ఇషాన్ కిషన్, సంజూ శామ్సన్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు.

ఇంగ్లండ్, ఇతర జట్ల వ్యూహాలు

డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ ఈసారి హ్యారీ బ్రూక్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్ వంటి స్టార్ ప్లేయర్లు జట్టులో ఉన్నారు. ఇక శ్రీలంక తన ప్రాథమిక జట్టును ప్రకటించగా, ఆఫ్ఘనిస్తాన్ రషీద్ ఖాన్ నాయకత్వంలో పటిష్టమైన స్పిన్ దళాన్ని సిద్ధం చేసుకుంది. ఒమన్ కూడా జతీందర్ సింగ్ కెప్టెన్సీలో తమ అత్యుత్తమ 15 మందిని ఎంపిక చేసింది. మిగిలిన 15 జట్లు కూడా త్వరలోనే తమ తుది స్క్వాడ్‌లను ప్రకటించనున్నాయి.

జట్ల వివరాలు :

భారత్

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ సామ్‌సన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్

ఇంగ్లాండ్

హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కర్రన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్

శ్రీలంక (ప్రాథమిక జట్టు)

దాసున్ షనాక (కెప్టెన్), పథుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కమిల్ మిశారా, కుసల్ పెరెరా, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా, జెనిత్ లియానగే, చరిత్ అసలంక, కమిందు మెండిస్, పవన్ రత్నాయకే, సహన్ అరాచిగే, వానిందు హసరంగా, డునిత్ వెల్లాలగే, మిలన్ రత్నాయకే, నువాన్ తుషారా, ఈషాన్ మలింగ, దుష్మంథ చమీర, ప్రమోద్ మధుషన్, మథీశ పతిరాన, దిల్షాన్ మధుషంక, మహేశ్ తీక్షణ, దుషాన్ హేమంత, విజయకాంత్ వ్యాసకాంత్, ట్రవీన్ మాథ్యూ

అఫ్గానిస్తాన్

రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్‌జయి, సెదికుల్లా అటల్, ఫజల్‌హక్ ఫరూకీ, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్ ఉల్ హక్, మొహమ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమాల్, మొహమ్మద్ నబీ, గుల్బదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జయి, ముజీబ్ ఉర్ రెహమాన్, దర్విష్ రసూలీ, ఇబ్రాహిమ్ జద్రాన్

రిజర్వ్ ప్లేయర్లు:

ఏఎం గజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జయి, జియా ఉర్ రెహమాన్ షరీఫీ

ఒమన్

జతిందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, మొహమ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మిర్జా, వసీమ్ అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మహ్మద్, జయ్ ఒడేద్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఒడేద్రా, జితెన్ రామానంది, హస్నైన్ అలీ షా

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీమిండియా సహా ఐదు జట్లు ఖరారు..సూర్య కెప్టెన్సీలో భారత్ రెడీ!
టీమిండియా సహా ఐదు జట్లు ఖరారు..సూర్య కెప్టెన్సీలో భారత్ రెడీ!
న్యూఇయర్‌ జోష్.. రూల్స్ బ్రేక్ చేస్తే డీజే మోతే..
న్యూఇయర్‌ జోష్.. రూల్స్ బ్రేక్ చేస్తే డీజే మోతే..
భారీగా పెరిగిన ధరలు.. దివాలా తీసిన 44 మంది వెండి వ్యాపారులు
భారీగా పెరిగిన ధరలు.. దివాలా తీసిన 44 మంది వెండి వ్యాపారులు
వరల్డ్ కప్ వేటలో ఆఫ్ఘన్ టైగర్స్..రషీద్ ఖాన్ కెప్టెన్సీలో టీం రెడీ
వరల్డ్ కప్ వేటలో ఆఫ్ఘన్ టైగర్స్..రషీద్ ఖాన్ కెప్టెన్సీలో టీం రెడీ
కొత్త సంవత్సరంలో వారికి శత్రువులపై విజయం ఖాయం.!
కొత్త సంవత్సరంలో వారికి శత్రువులపై విజయం ఖాయం.!
Toxic People: ఇలాంటి వ్యక్తులను మీ జీవితంలోకి అస్సలు రానివ్వొద్దు
Toxic People: ఇలాంటి వ్యక్తులను మీ జీవితంలోకి అస్సలు రానివ్వొద్దు
దిగొచ్చిన ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. డెలివరీ బాయ్స్‌కు బంపర్ ఆఫర్
దిగొచ్చిన ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. డెలివరీ బాయ్స్‌కు బంపర్ ఆఫర్
డేంజర్ మాంజా.. ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. వారంలోనే 3 ఘటనలు..
డేంజర్ మాంజా.. ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. వారంలోనే 3 ఘటనలు..
ఓ AI స్టార్టప్‌ను 2 బిలియన్‌ డాలర్లకు కొనేసిన మెటా..!
ఓ AI స్టార్టప్‌ను 2 బిలియన్‌ డాలర్లకు కొనేసిన మెటా..!
స్టేడియాలు దడదడలాడాల్సిందే.. 2026లో రోహిత్-విరాట్‎ల విశ్వరూపం!
స్టేడియాలు దడదడలాడాల్సిందే.. 2026లో రోహిత్-విరాట్‎ల విశ్వరూపం!